
వెల్గటూరు(ధర్మపురి): వెల్గటూరు మండలం కొండాపూర్కు చెందిన జల్లెల్ల మౌనిక(24) తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపంతో పురుగుల మ ందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మౌనికకు ఆమె కుటుంబసభ్యులు మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. అయినా ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు. పైగా తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. దీంతో తీవ్ర మానసిక వే దనకు గురైన మౌనిక జీవితంపై విరక్తి చెంది, ఈ నెల 13న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటు ంబసబ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొ ందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment