యువతిపై అత్యాచారయత్నం
కేకేనగర్: యువతిపై కొందరు యువకులు అత్యాచారం జరపడానికి యత్నించినట్లు ఫేస్‌బుక్‌లో సమాచారం వెలువడడంతో యువకుడి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై క్రోంపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ వసంతపాల్ మోడలింగ్ వృత్తికూడా చేస్తున్నాడు. ఇతడు తన ఫేస్‌బుక్‌లో చెన్నైలో ఒక థియేటర్‌లో రజిని నటించిన కబాలి సినిమా చూసి తన మిత్రులతో పాటు టీనగర్‌లో మద్యం సేవించి ఆ తరువాత రాత్రి సమయంలో ఆలందూర్ రోడ్డు మార్గంలో వస్తున్నట్లు తెలిపారు.
ఆ సమయంలో చీకటి ప్రాంతంలో ఒక యువతి కేకలు విని తాను అక్కడకు వెళ్లగా ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారం జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నడు. వెంటనే వారిని అడ్డుకోగా ఆ ముగ్గురు తనపై కత్తులతో దాడి చేసి గాయపరిచి పారిపోయారని వివరించారు. అక్కడకు ఆటోలో వచ్చిన డ్రైవర్ ఆమెను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడని పేర్కొన్నాడు. ఈ సమచారం ఫేస్‌బుక్‌లో దావానంలా వ్యాపించింది. దీనిపై పోలీసు అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపారు. సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. అతడిని విచారణకు ఎప్పుడు పిలిచినా స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని హెచ్చరించి వదిలేశారు.