ఇద్దరిపై కేసు నమోదు
ములుగు : యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఇరువురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ ఖరీంపాషా గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి రంగారెడ్డి జిల్లా తూంకుంట సాయితేజ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కళాశాలకు ప్రతిరోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తోంది. అందులో భాగంగా గురువారం కూడా కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రం నాలుగు గంటలకు తునికి బొల్లారంలో బస్సు దిగింది. అనంతరం అచ్చాయిపల్లికి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది.
దీనిని గమనించిన అదే గ్రామానికి చెందిన కనువుకుంట్ల మల్లేశం, జలాల్‌పురం శ్రీకాంత్‌లు యువతిని వెంబడించారు. మార్గమధ్యలో బాలికను చెట్లపొదల్లోకి లాగి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో యువతి వారిని నోరుతో కొరికి తప్పించుకుని సమీపంలో ఉన్న మామ వద్దకు పరుగులు తీసి విషయాన్ని చెప్పింది. ఈ మేరకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
యువతిపై అత్యాచారయత్నం
Published Thu, Aug 14 2014 11:55 PM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM
Advertisement
Advertisement