ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం | attempt to rape on six year old girl | Sakshi
Sakshi News home page

ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం

Published Wed, Sep 10 2014 10:28 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం - Sakshi

ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం

ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాపపై బడిలో అత్యాచారయత్నం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ దారుణం జరిగింది. గోకవరం రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పాఠశాలలో బాత్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న అప్పారావు బాత్‌రూమ్‌ తలుపు వేసి ఆమె పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అత్యాచార యత్నం కూడా చేశాడు. దాంతో భయపడిన ఆ చిన్నారి కేకలు పెట్టడంతో వెంటనే అక్కడినుంచి పారిపోయాడు.

పాప వెంటనే ఉపాధ్యాయురాలికి తెలిపినా పట్టించుకోలేదు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు పరారీలో ఉండటంతో పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement