ఎక్స్రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం! | lab assistant attempts to rape girl in x ray chamber | Sakshi
Sakshi News home page

ఎక్స్రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!

Published Fri, May 1 2015 5:08 PM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

ఎక్స్రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!

ఎక్స్రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమానుషం జరిగింది. వైద్యం కోసం వచ్చిన  యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు.  భీమవరం సమీపంలోని వీరవాసరం గ్రామానికి చెందిన యువతి  తనకు కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో చికిత్స కోసం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజిలో ఏప్రిల్ 28వ తేదీన చేరింది. వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయించాలని సూచించారు.  ఎక్స్రేలో ఉన్నదాన్ని బట్టి ఆమెకు చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ క్రమంలో ఎక్సేరే తీస్తానంటూ ల్యాబ్‌ అసిస్టెంట్‌ రాజు ఎక్స్ రే రూంలోకి తీసుకెళ్లాడు. అనంతరం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు  అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో జరగబోయే దారుణాన్ని పసిగట్టిన యువతి గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అతడు ముందుగానే తలుపు గడియ పెట్టాడు. అయినా ఆమె ఎలాగోలా తప్పించుకుంది. తల్లితో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement