x ray chamber
-
వైద్య చరిత్రలో గొప్ప మైలురాయి
ఓ శతాబ్దం వెనక్కి వెళితే మనిషి రుగ్మతలను తెలుసుకోవాలన్నా.. విరిగిన ఎముకలను, పగుళ్లను గుర్తించాలన్నా.. రోగి వివిధ శరీర అవయవాలలో కేన్సర్ కణుతులను గమనించాలన్నా.. మెదడులోని నాళాల్లో రక్తం గడ్డ కడితే తెలుసుకోవాలన్నా.. చిన్న, పెద్ద పేగులకు రంధ్రం పడ్డా.. చివరికి గుండెకి చిల్లు ఉన్నా.. గుండె పనితీరును అధ్యయనం చేయాలన్నా.. రొమ్ము కేన్సర్‌ను గుర్తించాలన్నా.. ఊపిరితిత్తులలో నీరు చేరినా.. ఆయా శరీర భాగాల్లో కోతలు పెట్టి శస్త్రచికిత్సలు చేస్తేగాని తెలుసుకోలేకపోయేవారు. కానీ.. నేడు శరీరానికి చిన్నగాటు కూడా పెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే వివిధ శరీర అవయవాల నిర్మాణం, పనితీరు, అవలక్షణాలు, రుగ్మతలు గుర్తించడంతో పాటు ముందుగానే కేన్సర్ వంటి రోగాలను పసిగట్టే వీలు ఏర్పడింది. ఇది కేవలం ఎక్స్ కిరణాల ఆవిష్కరణతోనే సాధ్యమైంది. ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య చరిత్రలో ఓ గొప్ప మైలురాయి. ఎక్స్ కిరణాలను ఉపయోగించి ఎన్నో అధునాతన రోగ నిర్ధరణ, చికిత్సా యంత్రాలను కనుగొంటున్నారు. ఎక్స్ కిరణాలతో వైద్య రంగంలోనే పలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో రుగ్మతలు తెలుసుకునేలా.. ఎక్స్‌రేను ఉపయోగిస్తూ రేడియాలజీ విభాగంలో రోగ నిర్ధారణకు మాత్రమే కాకుండా కేన్సర్ లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఉపకరణాలు, యంత్రాలు కనుగొన్నారు. ఎక్స్‌రే ఆవిష్కరణ వైద్య రంగంలో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. మొదట్లో ఎముకల పగుళ్లను చూడడానికి మాత్రమే వినియోగించారు. ఆ తర్వాత యంత్ర పరికరాలతో వివిధ అవయవాల నిర్మాణం, పనితీరు, రు గ్మతలు తెలుసుకోవడమే కాకుండా చికిత్సలు చేయడానికి ఆవిష్కరణలు తోడ్పడుతున్నాయి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తూ పనిచేసే ఎన్నో ఆధునిక పరికరాలు ఫ్లోరోస్కోపీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, స్పెక్ట్ స్కాన్, గామా కెమెరా, సి.ఆర్మ్ తదితర రోగాల నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఎక్స్ రే కిరణాలు కనుగొన్నాక వైద్య రంగంలో ఒక రోగ నిర్ధారణ విభాగం రేడియో డయాగ్నోసిస్ విభాగం నెలకొల్పారు. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈనా డు రేడియాలజీ. మేజియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ, నూక్లియర్ మెడిసిన్ తదితర విభాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎక్స్‌రే ఎలా..? 1895 నవంబర్ 8న జర్మనీ భౌతిక శాస్త్రవేత్త సర్ విలియం కొనరాడ్ రాంట్జెన్ ఓసారి అనుకోకుండా ఎక్స్ రే కిరణాలను కనుగొన్నారు. ఆయన ఉత్సర్గ నాళ ప్రయోగాలతో కేథోడ్ కిరణాల ధర్మాల పరిశీలించే క్రమంలో పక్కనే ఉన్న ప్లాటినో సయనైడ్ ఫలకంపై తన చేతి ఎముకలు దర్శనమిచ్చాయి. ఆశ్చర్యానికి గురైన ఆయన మళ్లీ మళ్లీ పరీక్షించి ఏవో కిరణాలు శరీరం గుండా ప్రసరిస్తూ ఎముకల నీడలను ఏర్పాటు చేస్తున్నాయి. సాధారణంగా గణితంలో తెలియని దానిని ఎక్స్ ( గీ) అని అనుకుంటాం. అలాగే రాంట్జెన్ ఆ ధర్మాలు తెలియని కిరణాలకు ఎక్స్ కిరణాలు భావించారు. చివరికి అదే పేరు స్థిరపడింది. పరిశోధనాలయంలో ఆయన కనుగొన్న ఎక్స్ కిరణాలు మానవాళికి ఇంతగా ఉపయోగపడతాయని ఆనాడు ఆయన ఊహించలేదు. ఈ ఆవిష్కరణకు భౌతికశాస్త్రంలో రాంట్జెన్ 1901లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఎక్స్ కిరణాలు కనుగొన్న నవంబర్ 8వ తేదీన ప్రపంచ రేడియోగ్రఫీ డేగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇదే రోజున అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా కూడా జరుపుకొంటారు. కేవలం వైద్య రంగంలోనే కాకుండా.. ఎక్స్ కిరణాలను కేవలం వైద్య రంగంలోనే కాదు పరిశ్రమలలో వివిధ యంత్ర పరికరాల పగుళ్లు, లీకేజీలను కనుగొనడానికి, విమానయాన రంగంలో వివిధ వస్తువుల, వ్యక్తుల స్కానింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ కిరణాల ఉపయోగం ఎంత ఉందో ఎలాంటి అశ్రద్ద, అజాగ్రత వహించినా సుశిక్షితులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకున్నా మేలు కన్నా కీడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు ఎంత ప్రమాదకరం అంటే కేవలం ఎక్స్ కిరణాలు ఎదుర్కొన్న వ్యక్తులలోనే కాకుండా వారి భవిష్యత్ తరాల లో కూడా వాటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఉపాధి అవకాశాలు మెండు.. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి, కంప్యూటర్ వినియోగం పెరగడంతో ఎన్నో కొత్త ప్రక్రియలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. రక్షణ చర్యలు, అతి తక్కువ రేడియేషన్ మోతాదులో వివిధ పరీక్షలు నిర్వహించేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. రేడియాలజీ ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రంగంలో స్థిర పడాలనుకునే వారికి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – శిరందాస్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ -
ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యం
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): పాలకుల నిర్లక్ష్యానికి ఆస్పత్రులు అధ్వానంగా తయారయ్యాయి. రోగులకు కనీస సౌకర్యాలు అందక అవస్థలు పడుతున్నారు. కొత్తూరు పీహెచ్సీలో ఏళ్లుగా వసతి, వైద్య సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ప్రజలు వైద్యం కోసం ఇతర మండలాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని చెప్పిన కలమట ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఐదుగురు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో ఒక్క రెగ్యులర్ వైద్యుడు కూడా లేకపోవడం దారుణం. ముగ్గురు వైద్యులు డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో అరకొరగా మందులు అందుబాటులో ఉండడం, సిబ్బంది లేకపోవడం, వైద్య పరికరాల, వసతి సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. కుటుంబ నియంత్రణ అపరేషన్ల కోసం బాలింతలు మండల కేంద్రం నుంచి 13 కిలోమీటర్లు దూరంలో ఉన్న కురిగాం పీహెచ్‌సీకి, లేదా సీతంపేట మండలం మర్రిపాడు పీహెచ్‌సీకి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గైనకాలజిస్టు లేక పోవడంతో గర్భిణులు, మహిళలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలు దాటుతున్నా నేటకీ కొత్తది మంజూరు చేయలేదు. దీంతో ఎముకలకు సంబంధించిన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పేరుకే 50 పడకల ఆస్పత్రి..కానీ రోగులకు పడకలు లేక వరండాలో చికిత్స పొందాల్సిన పరిస్థితి. తమకు అనారోగ్యం వస్తే విదేశాల్లో చికిత్సలు చేయించుకునే టీడీపీ నేతలు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిని గాలికొదిలేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఎక్స్‌రే మిషన్ లేక అవస్థలు ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలవుతోంది. కొత్త మిషన్ మంజూరు చేయాలని పాలకులకు పలుమార్లు వినతులు అందజేశాం. కానీ ఇంతవరకు మంజూరు చేయలేదు. ఎక్స్‌రే సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకో, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికో పరుగులు తీయాల్సి వస్తోంది. గైనకాలజిస్ట్, ఆర్థోపెడీషియన్ లేకపోవడంతో గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. – లోతుగెడ్డ ఉపేంద్ర, కొత్తూరు సీహెచ్‌సీ ఉన్నా పీహెచ్‌సీకి పరుగులు మండల కేంద్రంలో సీహెచ్‌సీ ఉన్నా వైద్యులు, మందులు, వసతి లేకపోవడంతో వైద్యం కోసం సీతంపేట, పాలకొండ పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అంత దూరం వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్తూరు సీహెచ్‌సీలో సదుపాయాలు కల్పించాలి. – పడాల వెంకటకృష్ణ, ఎన్.ఎన్.కాలనీ, కొత్తూరు -
ఎక్స్‌రే.. తీయరే!
కర్నూలు పెద్దాసుపత్రిలో ఎక్స్‌రే మిషన్లను ‘నిర్లక్ష్యపు రోగం’ పట్టిపీడిస్తోంది. మిషన్లు చెడిపోయి..రోగుల అవస్థలకు కారణమవుతున్నాయి. వీటి మరమ్మతుల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఆసుపత్రిలో వైద్యపరికరాల మరమ్మతుల పేరిట ప్రతినెలా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ ఏ పరికరమూ సక్రమంగా పనిచేయడం లేదు. ఉన్న ఒకట్రెండు పరికరాల వద్ద రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్స్‌రే మిషన్లు రెండు నెలలుగా పనిచేయకపోయినా.. వాటిని మరమ్మతు చేయాల్సిన టీబీఎస్ సంస్థ ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతిరోజూ 2,500 నుంచి మూడు వేల మంది రోగులు ఓపీ చికిత్సకు వస్తున్నారు. అలాగే నిత్యం 1,500 మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. వీరిలో ప్రతిరోజూ 300 మందికి పైగా రోగులకు ఎక్స్‌రే పరీక్షలు అవసరం అవుతుంటాయి. ఆసుపత్రిలోని 500 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు 7, మొబైల్ ఎక్స్‌రే మిషన్లు 10 ద్వారా ఈ సేవలు అందించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా 500 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు నాలుగు, మొబైల్ ఎక్స్‌రే మిషన్లు ఐదు పనిచేయడం లేదు. ఇక 1000 ఎంఏ, 800 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు కొన్నేళ్లుగా మూలనపడ్డాయి. వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లతో డీఆర్ సిస్టమ్ అనే ఎక్స్‌రే మిషన్ పంపించింది. అయితే.. సదరు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పూర్తిగా చెల్లించకపోవడంతో దాన్ని బిగించలేదు. నాలుగు నెలలుగా ఆసుపత్రిలో ఓ మూల చెక్కపెట్టెలో పడి ఉంది. ఈ యంత్రం ద్వారాఎక్స్రే ఫిల్మ్ లేకుండానే కంప్యూటర్లో పరీక్షా ఫలితాన్ని చూసే అవకాశముంది. ఈ మేరకు ప్రతి విభాగంలోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇందుకు అవసరమైన కంప్యూటర్లు మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ఇటీవలే సదరు సంస్థ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చి..మిషన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే.. కంప్యూటర్లు ఎప్పటికి సమకూరుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రోగుల అవస్థలు ఎక్స్‌రే మిషన్లు చాలావరకు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర అవస్థ పడుతున్నారు. రోజూ 300 మందికి పైగా ఎక్స్‌రేకు వస్తున్నారు. గురువారం రేడియాలజీ విభాగం వద్ద ఓపీతో పాటు ఐపీ రోగులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పనిచేయని ఎక్స్‌రే మిషన్లను మరమ్మతు చేయాలని టీబీఎస్ సంస్థకు ఆసుపత్రి అధికారులు పలుమార్లు చెప్పినా.. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిపేస్తున్నారు. దీనికితోడు ఎక్స్‌రే ఫిల్మ్‌లు ప్రింట్ తీసే యంత్రం కూడా నాలుగు రోజుల నుంచి మొరాయిస్తోంది. ప్రస్తుతం ఒకే యంత్రంతోనే ఫిల్మ్‌లు తీస్తుండటంతో నివేదికలు ఇచ్చేందుకు ఆలస్యమవుతోంది. -
అల్యూమినియంలో దాగారు.. ఎక్స్-రేకు చిక్కారు..
ఇస్తాంబుల్ : కంటైనర్ల ద్వారా అక్రమంగా టర్కీలోకి ప్రవేశించాలని చూసిన ఏడుగురిని ఎక్స్ రే మిషన్ పట్టించింది. ఇరాక్ చెందిన ఏడుగురు టర్కీలోకి అక్రమంగా ప్రవేశించాలని చేసిన యత్నం మాత్రం ఆసక్తికరంగా ఉంది. అధికారులు గుర్తించకుండా ఉండేందుకు ఏడుగురు అల్యూమినియం షీట్లను తమ శరీరాలకు చుట్టుకున్నారు. అనుకున్నట్లే అధికారులు వారిని గుర్తించలేకపోయారు. అయితే, సరిహద్దులో ఎక్స్ రే మిషన్ చేసిన స్కాన్‌లో వీరి బండారం బయటపడింది. షీట్లలో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు ఎక్స్ రే స్కాన్‌ను చూసిన అధికారులు తెలుసుకున్నారు. వెంటనే కంటైనర్‌ను తెరచి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
పేద రోగులకు కష్టం.. నష్టం
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో ఏకైక 100 పడకల వైద్యశాలగా ఉన్న మార్కాపురంలోని ఏరియా వైద్యశాలలో గత 10 రోజుల నుంచి ఎక్స్‌రే యూనిట్ చెడిపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా వైద్యశాలకు గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల్లోని రోగుల వైద్యసేవల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రధానంగా నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం కచ్చితంగా ఎక్సరే తీయాలి. రోజుకు 400 నుంచి 450 మంది వరకు రోగులు ఓపీ విభాగంలో చికిత్స పొందుతారు. వీరిలో ప్రతి రోజూ 60 నుంచి 70 మంది వరకు ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు విరిగిన వారికి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాద బాధితులకు మెడనొప్పి, పంటి నొప్పితో బాధపడుతున్న వారికి చికిత్స చేయాలంటే ఎక్స్‌రే అవసరం. అయితే ఎక్స్‌రే ప్లాంట్ లేకపోవటంతో వైద్యశాలలోని వైద్యులు రోగులకు బయట ఎక్స్‌రే తీయించుకోమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులకు ఆర్థిక భారం తప్పటం లేదు. కొన్ని రకాల చికిత్సలకు కచ్చితంగా ఎక్స్‌రే ఆధారంగానే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రోగులు 150 నుంచి 200 రూపాయలు చెల్లించి బయట తీయించుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎక్స్‌రే ప్లాంట్ చెడిపోయిన విషయాన్ని వైద్య విధాన పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో బాగు చేయించి రోగులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం.- చక్కా మాలకొండ నరసింహారావు -
హ్యాండ్‌బ్యాగ్ కోసం ఎంత పని చేసింది..!
గ్వాగ్డాంగ్, చైనా : పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే సెక్యూరిటీ చెక్స్ల్లో వస్తువులు పోతాయని ఎప్పుడైనా మీరు భయపడ్డారా?. చైనాలోని ఓ మహిళ అలానే భయపడ్డారు. మరో ఆలోచన లేకుండా రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ చెక్స్‌లో భాగంగా వినియోగించే ఎక్స్ రే మెషీన్‌లోకి హ్యాండ్ బ్యాగ్‌తో పాటు తాను కూడా ఎక్కారు. ఈ ఘటన దక్షిణ చైనాలో గల గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులోనిలో రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎక్స్ రే మెషీన్ స్క్రీన్‌లో మహిళ ఇమేజ్ను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. హైహీల్స్‌తో పాటే ఆమె ఎక్స్‌రే మెషీన్‌లోకి వెళ్లారు. దీంతో ఆమె జాగ్రత్తగా బయటకు వస్తుందో లేదో? అని ఆందోళన చెందారు. మెషీన్లో నుంచి ఆమె భద్రంగా బయటకు రావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. మహిళ ఎక్స్ రే ఇమేజ్‌లు చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. మరి మీరు మహిళ ఎక్స్ రే ఫొటోలపై ఓ లుక్కేయండి. -
ఏలూరులో అమానుషం
-
ఎక్స్‌రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమానుషం జరిగింది. వైద్యం కోసం వచ్చిన యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. భీమవరం సమీపంలోని వీరవాసరం గ్రామానికి చెందిన యువతి తనకు కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో చికిత్స కోసం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజిలో ఏప్రిల్ 28వ తేదీన చేరింది. వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయించాలని సూచించారు. ఎక్స్‌రేలో ఉన్నదాన్ని బట్టి ఆమెకు చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎక్సేరే తీస్తానంటూ ల్యాబ్ అసిస్టెంట్ రాజు ఎక్స్ రే రూంలోకి తీసుకెళ్లాడు. అనంతరం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో జరగబోయే దారుణాన్ని పసిగట్టిన యువతి గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అతడు ముందుగానే తలుపు గడియ పెట్టాడు. అయినా ఆమె ఎలాగోలా తప్పించుకుంది. తల్లితో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.