హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సంచలన సంఘటన జరిగింది. చదువుకోడానికి దేశం కాని దేశం వచ్చిన ఆఫ్రికన్ యువతి మీద ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దాంతో ఆ యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన యువతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ఒక యువకుడు గత కొంత కాలంగా బైకుపై వెంటపడి, వేధిస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాను బంజారాహిల్స్ నుంచి టోలిచౌకి వెళ్తుండగా అతడు వెంటపడి, తనపై అత్యాచార యత్నం చేశాడని ఆమె ఫిర్యాదుచేసింది. దాంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆమె బైకు నెంబరు కూడా ఇవ్వడంతో వివరాలు త్వరగానే తెలిసే అవకాశాలున్నాయి.
ఆఫ్రికన్ యువతిపై అత్యాచారయత్నం
Published Mon, Oct 20 2014 8:11 AM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
Advertisement
Advertisement