
బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం
హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం ఓ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నాన్ని బాలిక అడ్డుకోవటంతో వ్యక్తి ఆమెను గాయపరిచాడు. ప్రస్తుతం బాలిక ఒంటిపై కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.