
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్‌లో కలకలం సృష్టించిన ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యాసిడ్ దాడి కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు.
గురువును వేధిస్తున్నాడనే కారణంగా శిష్యుడు యాసిడ్‌తో దాడి చేశారు. సైదాబాద్ ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్న రాజశేఖర్ శర్మను అకౌంటెంట్ నర్సింగరావు వేధిస్తున్నాడని జాబ్లీహిల్స్ టీటీడీ ఆలయ పూజారి హరనాథ్ శర్మ.. యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గురుశిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
శుక్రవారం ఆలయంలో విధుల్లో ఉన్న ఎకౌంటెంట్ నర్సింగరావుపై యాసిడ్ దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజ్ ద్వారా విచారణ చేపట్టారు. బాధితుడు నర్సింగరావుతో కొంత కాలంగా ఆలయ పూజారితో విభేదాలు ఉన్నాయని సమాచారం.

Comments
Please login to add a commentAdd a comment