కొమరాడ, న్యూస్‌లైన్: మద్యం మత్తులో తనపై అత్యాచారానికి యత్నించిన మృగాడి మెడకు చున్నీ బిగించి, రాయితో కొట్టి తనను తాను రక్షించుకుందా గిరిపుత్రి. తరువాత కాసేపటికి అతడు మరణించాడు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర పెదశాఖ పంచాయతీ జల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. కొండ సమీపాన పాకలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన యువతి నిద్రపోతోంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గిరిజనుడు కడ్రక తిరుపతి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడిని చున్నీతో చుట్టి బయటికి గెంటేశానని, తర్వాత ఏమయిందో తనకు తెలియదని యువతి తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి ఎలాంటి కేసు నమోదు చేయాలో నిర్ణయిస్తామని ఎస్‌ఐ జేఏవీ రమణ ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
చున్నీతో చుట్టి.. రాయితో కొట్టి..
Published Fri, Sep 20 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement