
సాక్షి,చిన్నశంకరంపేట(మెదక్): ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాగేళ్ల బాలుడు లైంగిక దాడికిపాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు లైంగికదాడికి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్క ఇంటిలోఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించారు. పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్‌లు తెలిపారు. కాగా బాలుడు పరారీలో ఉన్నాడని తెలిసింది.
మరో ఘటనలో..
యువతి అదృశ్యం
నారాయణఖేడ్: కుటుంబం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం నారాయణఖేడ్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నా రాయణఖేడ్ మండలం శేరితండాకు చెందిన ఓ మహిళ అక్టోబర్ 29న తన కూతురును ఇంటిలో ఉంచి కొడుకు, కోడలితో కలిసి అల్లాపూర్ శివారులో కౌలుకు తీసుకున్న చేలో పత్తిని తెంచడానికి వెళ్లింది. పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. చుట్టుపక్కలవారిని, బంధువులను విచారించినా ఆమె ఆ చూకీ తెలియలేదు. దీంతో యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment