వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం | Hospital staff attempts rape on medical student on night duty | Sakshi
Sakshi News home page

వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం

Published Tue, Jan 13 2015 7:02 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం - Sakshi

వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం

ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. ప్రస్తుతం ఎండీ చదువుతున్న ఆ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రపోతుండగా.. సిబ్బందిలో ఒకరు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు సియాని గేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.

రవి అనే పారిశుధ్య ఉద్యోగి తెరిచి ఉన్న కిటికీ గుండా లోనికి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఇన్స్పెక్టర్ అశోక్ సిసోదియా తెలిపారు. అయితే ఆమె వెంటనే సాయం కోసం అరవడంతో ఇతర సిబ్బంది పరుగున అక్కడకు చేరుకున్నారు. వాళ్లు వస్తున్న విషయం తెలిసి రవి వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్తో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement