బాలుడిపై అత్యాచారయత్నం.. తీవ్రగాయాలు | boy seriously injured as girl forces for sex | Sakshi
Sakshi News home page

బాలుడిపై అత్యాచారయత్నం.. తీవ్రగాయాలు

Published Mon, Jun 27 2016 9:41 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

బాలుడిపై అత్యాచారయత్నం.. తీవ్రగాయాలు - Sakshi

బాలుడిపై అత్యాచారయత్నం.. తీవ్రగాయాలు

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల అమ్మాయి అత్యాచారయత్నం చేయడంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. కాన్పూర్ సమీపంలోని కుల్హౌలి అనే గ్రామంలో తన పక్క ఇంట్లో ఉండే పిల్లాడిని మంచి మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ అమ్మాయి అతడితో బలవంతంగా శృంగారానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అతడి మర్మావయవాలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది.

దాంతో అతడిని కాన్పూర్లోని హాలెట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. బాధితుడితో పాటు నిందితురాలు కూడా మైనరే కావడంతో ఫిర్యాదు నమోదు చేయడం కష్టంగా మరిందని కాన్పూర్ సీనియర్ ఎస్పీ శలభ్ మాథుర్ అన్నారు. న్యాయ నిపుణులు మాత్రం.. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోస్కో చట్టంలోని 8వ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement