ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం | Attempt to rape on the five years girl | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Published Thu, Sep 11 2014 12:34 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

Attempt to rape on the five years girl

- యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు
- పోలీసులకు అప్పగింత
ఏలూరు (వన్‌టౌన్) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉంది. పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామానికి చెందిన నార్మాన కోటేశ్వర్రావు (21) విద్యుత్ మీటర్ బిల్లు రీడింగ్ నమోదు కోసం ఆ ఇంటికి వచ్చాడు. బాలిక ఒంటరిగా కనిపించడంతో ఆమె తల్లిదండ్రుల కోసం ఆరా తీశాడు. వారు ఆస్పత్రికి వెళ్లారని తెలుసుకుని కోటేశ్వర్రావు ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యచారానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై త్రీటౌన్ ఎస్సై పి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement