మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారు.
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితులు ముగ్గురు కలసి సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
**