కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో నిర్వహించిన వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న హైకోర్టు జస్టిస్ రాధా రాణి
హఫీజ్‌పేట్: పిల్లల బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరమని హైకోర్టు జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమ 23వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధా రాణి, సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మహాత్మాగాంధీ, చండ్ర రాజేశ్వర్‌రావుల విగ్రహాలకు నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉందని, 2050 నాటికి అది మరో మూడింతలు పెరుగుతుందని తెలిపారు. సీఆర్ ఫౌండేషన్ నిర్వహించే వృద్ధాశ్రమంలో పెద్ద పెద్ద వారు ఉంటున్నారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాల నడం పొరపాటు అన్నారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అనేక కారణాల తో పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వారి తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమాలు అవసరమని వ్యాఖ్యానించారు.
చండ్ర రాజేశ్వర్‌రావు గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. రాజేశ్వర్‌రావు మరణానంతరం ఆయన కోరిక మేరకు సీఆర్ ఫౌండేషన్ చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చికిత్సా లయం, గ్రంథాలయం, నీలం రాజశేఖర్‌రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యద ర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా వు, కార్యదర్శి చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment