భువనగిరి ఖిలాపై హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి, కుటుంబ సభ్యులు
భువనగిరి: భువనగిరి ఖిలాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఖిలాపై చారిత్రాత్మాక కట్టడాలు, నీటి కొలనులు, నిర్మాణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఏకశిలపై నిర్మించిన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, భావితరాలకు తెలియజేసేందుకు శిథిలం కాకుండా పరిరక్షించుకోవాలని సూచించారు.
ఖిలా రాక్ క్లైలైంబింగ్‌కు అనువుగా ఉందని, ఇక్కడ శిక్షణ పొందినవారు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతారోహణ చేయడం మంచి పరిణామం అన్నారు. అనంతరం న్యాయమూర్తి కుమార్తెలు రాక్ క్లైలైంబింగ్, జిప్‌లైన్ చేశారు. జస్టిస్ రాధారాణి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment