హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం జరిగింది. ఓ గెస్ట్హౌస్లో వైద్య విద్యార్థినిపై ఒరిస్సాకు చెందిన ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. వైద్య పరీక్ష రాసేందుకు బాధిత యువతి కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చింది. గెస్ట్ హౌస్ లో పని చేసే క్లీనింగ్ బాయ్ ఈ ఘటనకు పాల్పడటంతో వైద్య విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైద్య విద్యార్థినిపై అత్యాచారయత్నం
Published Sat, Jun 7 2014 10:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement