నల్గొండ: కొన్నిగంటల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకబోతున్న తరుణంలో నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు చౌటుప్పల్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఓ లారీ డ్రైవర్ వచ్చి బాలికను కాపాడినట్టు తెలిసింది.
అప్పటికీ బాలిక ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపటికీ తేరుకున్నక వివరాలు చెప్పడంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్ధినిపై నలుగురు కీచకుల అకృత్యం
Published Tue, Dec 31 2013 8:16 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement