విశాఖపట్నం: యలమంచిలిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఇద్దరూ మద్యం తాగిన మైకంలో అత్యాచారయత్నం చేశారు. స్థానికులు వారిని పట్టుకొని పో్లీసులకు అప్పగించారు.
బాధితురాలి ఫిర్యాదుతో నిందితులు ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితులలో ఒకరు ఆర్మీ ఉద్యోగి కాగా, మరొకరు కోపరేటివ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆర్మీ ఉద్యోగి సెలవుపై ఇక్కడికి వచ్చాడు.