సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు.
దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్‌లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు.
ఇటీవలే బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్‌లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు.
దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment