పవన్‌ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ | IVRS Survey On Janasena Candidate Sundarapu Vijaykumar | Sakshi
Sakshi News home page

పవన్‌ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ

Published Fri, Mar 29 2024 9:24 PM | Last Updated on Sat, Mar 30 2024 11:49 AM

Ivrs Survey On Janasena Candidate Sundarapu Vijaykumar - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సర్వేల పేరుతో ఆశావహులు, అభ్యర్థులతో పాటు క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు పవన్‌.. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. ఐవీఆర్‌ఎస్‌ సర్వే కలకలం రేపుతుండగా, ఇదేం తిక్క అంటూ పవన్‌ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ ధోరణిపై జనసేనలో రచ్చ జరుగుతోంది.

తాజాగా, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్‌పై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. సీటు కేటాయించిన తర్వాత కూడా సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళనలో పడ్డారు. విజయ్ కుమార్‌ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం జరగ్గా, తరువాత జనసేన జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం పవన్ కల్యాణ్‌ దూరంగా ఉన్నారు. మరోవైపు చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్‌ఎన్ రాజు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనుచరులతో ఆయన రహస్యంగా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు.

ఇదీ చదవండి: దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement