
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్.. అని ఆంగ్ల నానుడి. నాలుగైదు రోజులుగా పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్ ముఖాన్ని చూస్తే.. ఆయన పరిస్థితి ఏంటన్నది తెలిసిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయం పవన్‌ను నిలువెల్లా వణికిస్తోందట. టీడీపీ నేత వర్మ అనుచరులు పవన్‌కు సహకరించేది లేదని ఇప్పటికే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు.
మరోవైపు మహాసేన రాజేష్ కూడా జనసేన ఓటమే లక్ష్యంగా తమ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని పవన్ అభిమానుల ఆరోపణ. పవన్‌ను ఎదగనిస్తే లోకేశం రాజకీయ భవిష్యత్తుకు గుదిబండలా మారతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆక్రోశిస్తున్నారు. అందుకే చిరంజీవితో సహా పవన్ తన కుటుంబాన్ని, బుల్లితెర, సినీ పరిశ్రమలో తన అనుయాయుల్ని బతిమాలి మరీ ఎన్నికల ప్రచారంలోకి దించారట.
ఇవి చదవండి: బాబు-మోదీ ఇద్దరూ తోడు దొంగలే..