pitapuram
-
కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం..! పిఠాపురం టీడీపీ వర్మ ట్వీట్ వైరల్
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
కాకినాడ, సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసింది. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
దళిత బాలికపై టీడీపీ నేత అత్యాచారం
-
బాబు, పవన్ పై పిఠాపురం ప్రజల ఆగ్రహం
-
ఉచిత చీరలు అంటూ మోసం.. పవన్ పై పిఠాపురం పబ్లిక్ ఆగ్రహం
-
రెండు నెలలుగా టీడీపీ వేధింపులు: పిఠాపురం మహరాజ కుటుంబం
కాకినాడ, సాక్షి: అధికారం చేపట్టి నాటి నుంచి టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలను కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతల నుంచి సామాన్యుల దాకా కూటమి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. పిఠాపురం మహారాజ కుటుంబం సైతం వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. పిఠాపురం మహారాజా మేనకోడలైన చంద్రలేఖ కుటుంబానికి టీడీపీ నుంచి వేధింపులు ఎదురవుతున్నాయట. తమ ఇంటిని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నట్లు ఇద్దరు కొడుకులతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ‘‘1970 నుంచి మా కుటుంబం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇంట్లో మేం ఉంటున్నాం. ఆ ఆస్తి మీద కొందరు కన్నేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. .. ఈ దౌర్యన్యం వెనుక టీడీపీ నేతల సహకారం ఉంది. అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోవట్లేదు అని చంద్రలేఖ కుమారుడు మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరాం. మాకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటోంది చంద్రలేఖ కుటుంబం. -
పిఠాపురంలో సీన్ రివర్స్
-
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
సాక్షి, పిఠాపురం: అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడారు.‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా?. 5 ఏళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’ అని సీఎం జగన్ అన్నారు.చదవండి: దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్ -
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
-
PK: 'పులుసు కారుతోంది'..!
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్.. అని ఆంగ్ల నానుడి. నాలుగైదు రోజులుగా పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్ ముఖాన్ని చూస్తే.. ఆయన పరిస్థితి ఏంటన్నది తెలిసిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయం పవన్‌ను నిలువెల్లా వణికిస్తోందట. టీడీపీ నేత వర్మ అనుచరులు పవన్‌కు సహకరించేది లేదని ఇప్పటికే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు.మరోవైపు మహాసేన రాజేష్ కూడా జనసేన ఓటమే లక్ష్యంగా తమ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని పవన్ అభిమానుల ఆరోపణ. పవన్‌ను ఎదగనిస్తే లోకేశం రాజకీయ భవిష్యత్తుకు గుదిబండలా మారతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆక్రోశిస్తున్నారు. అందుకే చిరంజీవితో సహా పవన్ తన కుటుంబాన్ని, బుల్లితెర, సినీ పరిశ్రమలో తన అనుయాయుల్ని బతిమాలి మరీ ఎన్నికల ప్రచారంలోకి దించారట.ఇవి చదవండి: బాబు-మోదీ ఇద్దరూ తోడు దొంగలే.. -
'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తాను ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదని మొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వల్లె వేశారు. తాను కులాలకు అతీతమంటూనే కాపులకు ప్రాధాన్యమేదని ప్రశ్నిస్తారు. రాష్ట్రమంతా జల్లెడ పట్టి ఆ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర కులాల పట్ల విద్వేష పూరితంగా మాట్లాడతారు. గతంలో టీడీపీని పలుమార్లు తూర్పారబట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తన ఫ్యాన్స్ నుంచే ప్యాకేజీ స్టార్‌గా గుర్తింపు పొందారు. బీజేపీని తీవ్రంగా నిందించిన ఆ నోటితోనే అత్యద్భుతమని పొగుడుతారు. మాటలో నిజాయితీ, వ్యవహారంలో స్థిత ప్రజ్ఞత, మనిíÙలో స్థిరత్వం మచ్చుకైనా కనిపించని పవన్ నాయకత్వంలోని భ‘జనసేన’లో ఇక కొనసాగలేమని పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.నేను ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. ఎదిరిస్తాను.. అంతు తేలుస్తాను.. ప్రజల పక్షాన నిలుస్తాను... అంటూ నిత్యం ఊగిపోతూ డాంబికాలు పలికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ ప్రశ్నలకు కనీస స్థాయిలో సమాధానం చెప్పుకునే స్థితిలో లేరనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న తీవ్ర అవమానాలు, అసహనాలు, ఈసడింపులు, ఛీత్కారాలను తట్టుకోలేకపోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.జనసేనాని తీరుతోనూ వరుసగా పార్టీని వీడిపోయే వారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు మచ్చుకు ఒక్కరూ కనిపించడం లేదంటున్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఏదో సాధించేస్తారనే అంచనాలతో పవన్ పక్కన చేరిన మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, సీనియర్ నాయకులకు ఆయన తత్వం త్వరగానే బోధపడి తమ దారి చూసుకున్నారు.రాజకీయాలపై ఆసక్తితో, ఏదో ఒకటి చేయకపోతారా, పార్టీని ముందుకు తీసుకెళ్లకపోతారా, మంచి రోజులు రాకపోతాయా? అనే ఆశతో ఇటీవలి వరకు కొనసాగిన వారికి మాత్రం తమ దింపుడు కల్లం ఆశలు ఆవిరై జనసేనకు జెల్లకొట్టి ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. కొందరేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటన్న భావనతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇంకొందరు పదవులపై ఆశలు వదులుకుని రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.కూటమిలో సీట్ల సర్దు‘పాట్ల’ను చూసిన తర్వాత దాదాపు రోజూ జనసేనలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి హోదా కలిగిన నాయకులు ‘పవన్.. నీకో నమస్కారం..’ అంటూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. చివరకు తోక పార్టీగా మారి సైకిల్ వెనుక తిరిగేలా, టీడీపీకి సేవ చేసుకునే ‘సేన’లా జనసేనాని చేసేశారని, కనీస గౌరవ మర్యాదలూ దక్కడం లేదని జనసేన శ్రేణులు మధన పడుతున్నాయని ఆ పార్టీని వీడిన వారు వివరిస్తున్నారు. ప్రతి అడుగులోనూ తొట్రుపాటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామనే అంచనాలతో కొణిదెల చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. కాలక్రమంలో జెండా ఎత్తేసి కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. అన్నకు తోడుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం చీఫ్‌గా చలామణీ అయిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికలకు ముందు ‘జనసేన’ను స్థాపించినప్పటికీ ప్రతి అడుగులోనూ తొట్రుపాటే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.పార్టీ ఆవిర్భావంలో టీడీపీ, బీజేపీలతో జత కట్టిన పవన్, ఏ ఎండకా గొడుగు అన్నట్లు ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడుతూ తన అవసరాలు కానిచ్చేసుకుంటూ వచ్చారు. 2019 నాటికి టీడీపీకి మేలు చేసేలా ‘రహస్య ఒప్పందాలు’తో తన జనసేనే ప్రత్యామ్నాయమనే రీతిలో ఎన్నికల బరిలోకి దిగి.. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టిన పవన్.. చంద్రబాబు కోసం నానా ప్రయాసలకు లోనవుతూ తన నటనానుభవాన్ని రంగరించారు.చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అంగీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడాలనుకున్న అనేక మంది ఆశావహులపై నీళ్లు చల్లారు. పిఠాపురం నుంచి స్థానికేతరుడిగా బరిలో నిలిచి .. స్థానికురాలు, విద్యావంతురాలు, సీనియర్ రాజకీయవేత్త అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతతో పోటీ పడటానికి కిందామీదా పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గం ముందే మేల్కొని.. తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆర్.ఆర్.రామ్మోహన్రావు, సీబీఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, రాఘవయ్య, బైరా దిలీప్, ఆకుల చంద్రశేఖర్ లాంటి వారెందరో పవన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, వ్యవహార శైలిని పసిగట్టి పక్కకు తప్పుకున్నారు.రాజకీయాలపై ఆశలున్న వారు పలువురు పార్టీలోకి అడుగిడి రూ.కోట్లు, లక్షలు పోగొట్టుకున్న తర్వాత మేల్కొని దూరమయ్యారు. తాము ఏ విధంగా మోసపోయిందీ ఏకరువు పెట్టారు కూడా. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ ఓడిపోయినా, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. çపలు నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందిన జనసేన అభ్యర్థులకు తాజా ఎన్నికల్లో కూటమి తరఫున సీట్లు సాధించుకోవడంలోనూ పవన్ పూర్తిగా విఫలమయ్యారు.విజయవాడ వెస్ట్‌లో బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ ఉమ్మడి కృష్ణాలో బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లాలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అప్పారావు, నేరెళ్ల సురేష్ దర్శికి చెందిన ఎన్ఆర్ఐ వెంకట్, తూర్పుగోదావరికి చెందిన తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పాతంశెట్టి సూర్యచంద్ర తదితరులు జనసేన బాధిత వర్గంగా మిగిలిపోయారు. అవనిగడ్డ సీటు ఆశించిన వారిదీ అధోగతేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.కొన్ని జిల్లాలకే పరిమితం..రాష్ట్ర స్థాయి పార్టీగా ఆవిర్భవించిన జనసేనను పవన్ కళ్యాణ్ తన అపరిపక్వతతో అతి తక్కువ సీట్లతో కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. ఆ సీట్లు కూడా చాలా మంది టీడీపీ నేతలకే ఇచ్చారు. జనసేన ఆవిర్భవించి దశాబ్ద కాలమైనా సంస్థాగతంగా కనీస స్థాయిలో బలపడలేదు. చివరకు పార్టీ గుర్తునూ సక్రమంగా దక్కించుకోలేని స్థితిలోకి జనసేన దిగజారింది. ‘జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాటలను, ఆయన బంధం వ్యవహారాలను అంచనా వేసుకోలేక అమెరికా నుంచి కుటుంబం మొత్తం వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాం.కోట్ల రూపాయలు పోగొట్టుకుని నష్టపోయాం. సీటు ఇస్తామంటూ మోసం చేశారు’ అని దళిత మహిళ సి.సుభాషిణి ఆవేదనలో జనసేన చేతిలో దెబ్బతిన్న వారందరి గుండె ఘోష వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ వెంట నడవడానికి, వేదికను పంచుకోవడానికి కూడా పలువురు టీడీపీ నాయకులు అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని జనసేన నేతలు వాపోతున్నారు. పవర్ లెస్!పిఠాపురంలో పని చేయని పవన్ మానియా అందుకే మెగా ఫ్యామిలీని దింపుతున్నారని చర్చ పలువురు బుల్లితెర నటులు సైతం ప్రచారం ఇంత మంది వస్తే గానీ నెగ్గలేనని అనుమానం! తానొక్కడిని గెలిస్తే చాలనుకుంటున్న వైనంజనసేన అభ్యర్థుల గెలుపుసంగతేమోగానీ, పిఠాపురంలో తాను గెలిస్తే చాలనే స్థితికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాయకుడిగా తాను నిలబెట్టిన వారి గెలుపు సంగతి పక్కనబెట్టి, అధిక సమయం తన కోసమే కేటాయించుకున్నారని ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తానొక్కడే గెలిచి అసెంబ్లీకి వెళితే చాలన్నట్టుగా ఉంది ఆయన శైలి అని జనసేన శ్రేణులు వాపోతున్నాయి.పవన్ అన్న నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేశారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు. నాగబాబు భార్య సైతం మరిది కోసం ప్రచారంలో పాలు పంచుకున్నారు. పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా పిఠాపురంలో తిరగాల్సిన పరిస్థితి. వీరికితోడు జబర్దస్త్ టీం మొత్తం ఇక్కడ వాలిపోయింది. అయినప్పటికీ పిఠాపురంలో ప్రచారం సరిపోదనుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లే మెగాస్టార్ చిరంజీవిని పిఠాపురంలో ప్రచారానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.పదుల సంఖ్యలో తారలు దిగి వస్తున్న తీరు చూస్తుంటే పిఠాపురంలో తన గెలుపుపై పవన్‌కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోందంటున్నారు. ప్రచార ఆర్భాటం, మద్యం, డబ్బు లేని ఎన్నికలు రావాలని తెగ గొప్పలు చెప్పిన పవన్.. ఇప్పుడు రూ.కోట్లు వెదజల్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎమ్మెల్యే కాకపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందులో మెగా హీరోలు, జబర్దస్త్ ఆరి్టస్టుల స్పెషల్ ఫ్లైట్ చార్జీలు, ఇతర ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు.ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అంత ఖర్చుకు సిద్ధమయ్యారని ఇక్కడి ఏర్పాట్లు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవడం కష్టంగా ఉందని జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. కాగా, పిఠాపురంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న టీడీపీ నేత ఖర్చే భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే రోజూ పెద్ద మొత్తంలో చెల్లించుకుంటున్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. -
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
-
Pawan Kalyan: దిగజారిన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్..
పిచ్చోడి గురించి వినడమే కాని, ఇంతవరకు చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఒక సినమా డైలాగు ఉంది. ఈ మధ్య కొందరు నేతల ప్రసంగాలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిచ్చోడని మనం అనజాలం కానీ, ఆయన స్పీచ్‌ల తీరు మాత్రం రాజకీయ అజ్ఞానాన్ని, ఆయన ప్రస్టేషన్‌ను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తం మీద తన గెలుపు మీద తనకే అపనమ్మకం ఏర్పడిందో, లేక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై అవిశ్వాసం ఏర్పడిందో కానీ, తన కుటుంబ సభ్యులందరిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. అలాగే జబర్దస్త్ టీమ్ పై నమ్మకం పెట్టుకున్నట్లున్నారు.అఫ్ కోర్స్.. ఆయన సతీమణి అన్నాలెజోవా కనిపించడం లేదనుకోండి. ఆయన ప్రచారం ఆయన ఇష్టం. ఎందుకంటే పిఠాపురంలో తనను గెలిపించాలని వర్మను వేడుకున్న పవన్ కల్యాణ్ ఇతర నియోజకవర్గాలలో కూటమి అభ్యర్దులను గెలిపిస్తానని తిరుగుతున్నారు. పిఠాపురానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఏమి చేస్తానో చెప్పకుండా ఊదరకొట్టుకుంటూ తిరిగుతున్న పవన్‌ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. సినిమా నటుడు కనుక కాసేపు వినోదం కోసం ఆయనను చూడడానికి వచ్చి, ఆయన పిచ్చి గంతులు, చిందులు చూసి, పనికిమాలిన డైలాగులు విని ఏదో సినిమా చూశాంలే అని జనం సరిపెట్టుకుంటున్నారు. గతంలో గాజువాక, భీమవరంలలో జరిగింది అదే.మరో చిత్రం ఏమిటంటే ఆయన కాకినాడ సిటీలో చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌లో కన్నబాబుల అంతు చూడడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారట. ఆయనే ఈ సంగతి చెప్పారు. నిజంగా వీరి అంతు చూడాలనుకుంటే ఆ నియోజకవర్గాలలో కదా ఆయన పోటీ చేయాల్సింది. అక్కడికి చంద్రశేఖరరెడ్డి ఒకటికి, రెండుసార్లు సవాల్ కూడా విసిరారు కదా? అయినా కాకినాడలో పోటీచేయకుండా పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ చిత్తగించారు.రాజకీయాలలో కాస్త పద్దతిగా మాట్లాడాలి. అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయా చోట్ల పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతే పట్టరాని కోపంతో ఊగిపోతూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రిని అధఃపాతాళానికి తొక్కేస్తారట. ఇది ఆయన సినిమాలో నటించడమనుకుంటున్నారు కానీ, ప్రజాసేవ అనుకోవడం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు వస్తున్నాయి.2019 లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించి ఆయన భాషలో చెప్పాలంటే పాతాళానికి తొక్కారు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే పవన్‌ను చంద్రబాబు అధఃపాతాళానికి తొక్కేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా లేకుండా చేసేశారు. ఒకప్పుడు తాను సీఎంను అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్‌ను ఆ ఊసే ఎత్తనివ్వకుండా చంద్రబాబు తన పెరటి మనిషిగా మార్చుకున్నారు. జనసేనను రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలలో పోటీచేయనివ్వకుండా, ఓ ఇరవైఒక్క సీట్లు ఇచ్చి, అందులో డజను సీట్లలో టీడీపీ వాళ్లనే పెట్టి పవన్‌ను కేవలం తన కాళ్ల వద్ద పడి ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు.చంద్రబాబు వద్ద ఊడిగం చేయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని భావించిన పలువురు జనసేన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సంగతి అర్ధం కాకో, లేక అర్దం అయినా, చంద్రబాబుకు సరెండర్ అయినందువల్లో నోరు మెదపకుండా ఆయన చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. జనసేనను రాష్ట్ర వ్యాప్త పార్టీగా లేకుండా చేసి, కేవలం రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేసి పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు తెలివిగా చూపెట్టారు. ఇక ఎప్పటికీ జనసేన అధఃపాతాళంలోనే ఉండేలా చంద్రబాబు చేస్తే, ఈయనేమో ఎవరినో తొక్కుతానని ప్రగల్బాలు పలుకుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ పిఠాపురం నేత వర్మ కూడా ఈయన ధోరణితో విసిగి చిరాకు పడుతున్నారట. ఆయన పవన్‌కు ఆశించిన రీతిలో సహకరించకపోతే ఇంతే సంగతులు అన్న పరిస్థితి పిఠాపురంలో ఏర్పడిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా ఘోరంగా అబద్ధాలు చెబుతూ, ఒక్కోచోట ఒక్కో మాట చెబుతూ ప్రజలను, ముఖ్యంగా అభిమానులను బురిడి కొట్టించాలనుకుంటున్న పవన్ లీలలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. తాను ఇంటర్ చదివానని, అందులో కూడా ఆయా చోట్ల ఒక్కో గ్రూప్ చదివినట్లు చెప్పడం, తీరా చూస్తే ఆయన ఎస్ఎస్ఎల్సి అని బ్రాకెట్ లో 10 వ క్లాస్ అని పెట్టడంతో ఈయన ఏమిటో అర్దం అయింది.ఆస్తుల కొనుగోలు లావాదేవీలలో కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత మోసపూరితంగా ఉంటారా అన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. పవన్ ఎక్కడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారట. ప్రజలను రోడ్డుపైకి లాగేస్తారట.. బుర్ర, బుద్ది ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి పిచ్చి విమర్శలు చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా అలా చేయగలుగుతుందా? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంత వెర్రివాళ్లు, వాళ్లకు ఏమి తెలియదని, ఈయన ఏమి చెబితే దానిని చెవిలో పువ్వు పెట్టుకుని వింటారని అనుకుంటున్నారా? ఆ జిల్లా ప్రజలు బాగా తెలివైన వాళ్లన్న సంగతి పవన్ కు తెలియదు.రేషన్ బియ్యం విక్రయాలలో 20 వేల కోట్ల కుంభకోణం చేశారట. అసలు ప్రభుత్వం ఇస్తున్నదే ఉచిత రేషన్ బియ్యం. అందులో స్కామ్ ఏమిటి? ఇంత అజ్ఞానమా? రీ సర్వే పేరుతో ప్రజల భూములను కంప్యూటరైజ్ చేస్తున్నారట. తద్వారా దోచేస్తారట. ఇది కేంద్రం తీసుకు వచ్చిన చట్టం అని తెలియకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే తప్పుడు వార్తలను పట్టుకుని పిచ్చి ఉపన్యాసాలు చేస్తే ఏమి ప్రయోజనం. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటీకరణ జరుగుతుంటే, భూముల వివరాలు కంప్యూటర్లలో ఎక్కించకూడదట. మరి భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు పాలన సమయం నుంచి కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా? దాని వల్ల ఏ ప్రమాదం వచ్చిందో పవన్ చెప్పాలి కదా? అసలు ఇంతవరకు ఆ చట్టమే అమలులోకి రాలేదు. అయినా ఇలా వక్రీకరిస్తున్నారు.ఇక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి మిధున్ ప్రత్యేక శ్రద్ద పెట్టడమే. రాజకీయాలలో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, వారిని ఓడిస్తా.. వీరిని ఓడిస్తా.. అని చెబుతుండే పవన్ తను పోటీచేసే నియోజకవర్గానికి వేరే పార్టీవారు వచ్చి బాధ్యత తీసుకోకూడదట. దీనిని బట్టే మిధున్ రెడ్డి అంటే పవన్ ఎంత భయపడుతున్నది అర్ధం చేసుకోవచ్చు.మాజీ మంత్రి కన్నబాబుకు చిరంజీవి రాజకీయ భిక్షపెట్టారట. అయినా చిరంజీవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే స్పందించలేదట. చివరికి తన అన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పడమేనా! చిరంజీవిని అంత చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటే, చంద్రబాబు చెప్పమన్నాడని, పవన్ కళ్యాణ్ ఈ రకంగా అసత్యాలు చెబుతున్నారు. కన్నబాబు వైఎస్సార్సీపీలో ఉంటే ఈయనకు వచ్చిన బాధ ఏమిటి? మరి చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు? పవన్ కల్యాణ్ కొంతకాలం బీజేపీ, టీడీపీలతో, మరికొంతకాలం బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో ఎందుకుపొత్తు పెట్టుకున్నారు. మళ్లీ తాను గతంలో బండ బూతులు తిట్టిన టీడీపీ, బీజేపీల పంచన ఎందుకు చేరారు? ఏదైనా మాట్లాడే ముందు అర్ధం ఉండాలి.మిధున్ రెడ్డి ఏదో మద్యం వ్యాపారి అట. ఈయనేదో పవిత్రుడు మాదిరి కబుర్లు. ఒక పక్క అక్రమ సారా వ్యాపారం చేసి రాజకీయాలలోకి వచ్చిన సీ.ఎమ్.రమేష్ ను గెలిపించాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోరుతూ మరో పక్క మిధున్‌పై విమర్శలు చేయడం అంటే ఈయన సారా పైత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. ఒకపారి కాపులైనా తనకు ఓటు వేయాలని, మరోసారి తనకు కులం ఏమిటని, ఇలా రకరకాలుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో తన దత్తతండ్రి కళ్లలో ఆనందం చూడాలని తిరుగుతున్నారు. అందుకే ఆయనకు ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు.పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇంతగా దిగజారి చంద్రబాబుకు తెగ భజన చేస్తున్న తీరు మాత్రం సినీ నటుడుగా ఆయనకు ఏర్పడిన అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. జనసేన మొత్తం దివాళా తీసినా పర్వాలేదు.. తాను ఒక్కడినైనా గెలవాలన్న వాంఛతో పిఠాపురంలో తంటాలు పడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటూ రోడ్లపైకి ఎందుకు వచ్చానో ప్రజలు ఆలోచించాలి అని పవన్ అన్నారు. అవును!ప్రజలు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రస్తుతం రోడ్లపై ఈయన తిరుగుతాడు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చేవారిని రోడ్డుపై నిలబెడతారు! అంతకు మించి ఈయన గెలిచినా, ఓడినా ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్ కల్యాణ్ Vs పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి
పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు. హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు. అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట.. ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు. ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. -సిమ్మాదిరప్పన్న. -
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు
-
AP: కన్ఫ్యూజన్లో పవన్.. ‘వర్మ’పైనే భారం !
సాక్షి, కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతలతో తిట్లు తిన్న పవన్ కల్యాణ్‌కు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టీడీపీ నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించడం పై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ ఏం చేస్తున్నారు..? పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలా ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్ధులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఒక వైపే చూస్తున్నారు. రెండో వైపు చూడ్డానికి భయపడుతున్నారు. కాపుల ఓట్లే కారణమా.. పిఠాపురం సీటును ఆయన ఎంచుకోడానికి కారణం ఆ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడమే. కులాలు లేవు మతాలు లేవు..నేను విశ్వమానవున్ని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తమ కులం ఓట్లకోసమే పిఠాపురం ఎంచుకున్నారని టీడీపీ సీనియర్లే అంటున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఎవరూ కదలి రావడం లేదు. పిఠాపురం లో టీడీపీ రెబల్ వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన అయిష్టంగా పవన్ కు మద్దతుగా ఉంటానని అన్నారు. అయితే మాటలు చెప్పినంత జోరుగా వర్మ ప్రచారంలో పాల్గొనడం లేదు. దూసుకుపోతున్న వంగా గీత.. పిఠాపురం నియోజకవర్గంలో పాలకపక్ష అభ్యర్ధి వంగాగీత దూసుకుపోతున్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లోనూ మంచి పేరు ఉండడమే కాకుండా అన్ని వర్గాలూ ఆమెకు అండగా ఉన్నాయి. వాటిని మించి ప్రభుత్వం అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు..అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాయి. అవే తనని గెలిపిస్తాయని గీత ధీమాగా ఉన్నారు. ఓటమిని ఒప్పుకున్నట్లే.. పిఠాపురం గెలుపు భారం వర్మపై వేసిన పవన్ ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి.. ఆ పార్టీ తరపున మిగతా అభ్యర్ధుల నియోజక వర్గాలు పట్టించుకోకుండా కేవలం తన సొంత నియోజక వర్గానికే పరిమితం అయిన పవన్ కల్యాణ్ కనీసం తనని తాను గెలిపించుకునే పరిస్థితిలో లేనందునే వర్మలాంటి ఊత కర్రలకోసం వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా..? -
ఒక్కరోజు ఎండలకే పవన్ పరార్
ఎండాకాలం... ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాయి. సుకుమారంగా సున్నితంగా పెరిగే జీవులకు ఇవి గడ్డు రోజులు. కోళ్లఫారాలు...హైబ్రిడ్ ఆవులు.. గేదెలు పెంచేవాళ్ళు తమ జీవాలను కాపాడుకునేందుకు వాటికి ఏసీలు పెడుతుంటారు. తరచూ చల్లని నీళ్లు చల్లుతూ వాటిని కూల్ చేస్తుంటారు.. లేదంటే అవి ఎండవేడికి తట్టుకోలేక గుడ్లు తేలేస్తాయి..నిత్యం ప్రజల్లోనే ఉంటాను.. ప్రజలతోనే ఉంటాను.. ప్రజలకోసం ఉంటాను.. సీఎం వైఎస్ జగన్‌కు యుద్ధాన్ని చూపిస్తాను అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను ముగించారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. మచ్చుకు ఒక రోజు అలా పిఠాపురం వెళ్లి టీడీపీ వర్మను.. ఇంకొందరు పెద్దలను కలిసి ప్రచారం చేసారు. ప్లీజ్.. ప్లీజ్.. నన్ను గెలిపించండి అని అర్థించారు. తాను గెలిస్తే అక్కడ ప్రైవేటుగా నిధులు సేకరించి ఆస్పత్రి నిర్మిస్తాను అని చెప్పి... కాస్త హడావుడి చేసారు. అంతే.. మళ్ళీ సాయంత్రం చూస్తే పవన్ లేరు. జంప్.. ఏమైంది అని ఆరా తీస్తే జర్రమొచ్చింది అనే సమాచారం తెలిసింది. మండుటెండల్లో రెండ్రోజులు జనాల్లో తిరిగేసరికి ఆయనకు ఆరోగ్యం చెడింది. సాయంత్రానికి జర్రమొచ్చింది... జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.. దానికితోడు ఆయన మీద అభిమానులు పూలు చల్లడంతో అది కూడా ఎలర్జీకి దారితీసిందని తెలిసింది.. దీంతో ఇక ప్రచారం రద్దు చేసి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి షో చేసి.. ఫోటోలు దిగి... ప్రభుత్వాన్ని.. రాజకీయ వైరి పక్షాలను నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. ఎండావానలను లెక్కచేయకుండా ప్రజల్లో ఉండాలని... అప్పుడే వారి అభిమానం చూరగొంటామని ప్రజలు సైతం అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ అంటే సినిమాల్లో పెద్ద స్టార్.. అడుగుతీసి అడుగువేస్తే పూలు పరుస్తారు... గొడుగుపడతారు.. మేకప్ చెదిరిపోకుండా క్షణానికోసారి టచప్ చేస్తారు. గంటకోసారి ఏసీలో కూర్చోవచ్చు.. కానీ రాజకీయాల్లో అదేం ఉండదు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... వాగులు వంకలు... గుట్టలు కొండలు అన్నీ దాటాలి. ప్రతి గుండెనూ తడమాలి... ప్రతిపేదవాన్నీ తనవాడు అనుకోవాలి... అన్ని చేస్తేతప్ప ప్రజల్లో నిలవలేరు. జస్ట్ అలా వచ్చి నోటికొచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోతే రాజకీయం కాదు అనే విషయం పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదు. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది... దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో... సేనాని దమ్ము ఇంతేనా... ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం... స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా... క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా ? పిఠాపురం ఒక్కదానికే అయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని... బ్రాయిలర్ కోడి మళ్ళీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
‘పవన్.. పేకాట క్లబ్ మూయిస్తారా? లేక పార్ట్నర్ అవుతారా?’
నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే సామెత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదీ మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి గురించి ముందు నెగిటివ్‌గా మాట్లాడి వెంటనే పాజిటివ్‌గా పొడుగుతూ ఆయన్నే దగ్గరకు తీసుకుంటారు పవన్. అంతేకాదు పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేస్తారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు(2014) పిఠాపురం నుంచి ఎన్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పవన్.. వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఇక్కడ పేకాట క్లబ్ నడుపుతున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి పేకాట నడుపుతారా? అని ప్రశ్నించి వర్మపై చిందులు వేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక, కట్ చేస్తే ఇప్పుడు అదే వర్మను కలిసి పవన్ సాదర ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం వర్మను వీరుడు అని అంటున్నాడు. దీంతో, సోషల్ మీడియాలో పవన్‌పై ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా.. ఒకవేళ పవన్ గెలిస్తే మీ పార్ట్నర్ పేకాట క్లబ్ మూస్తారా? లేక మీరే పార్ట్నర్ అవుతారా? అని నెటిజన్లు ప్రశిస్తున్నారు. ఇదే సమయంలో పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
రీల్ వర్సెస్ రియల్‌లో... పవన్ గందరగోళం!
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురంలో నిజంగానే రిస్కులో పడ్డట్టే ఉన్నారు. ఆయన వ్యక్తం చేస్తున్న భావాలు కాని, పిఠాపురంలో తెలుగుదేశం నేత వర్మ చేస్తున్న ప్రకటనలు కాని గమనిస్తే ఆ నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్‌కు తలనొప్పి తప్పదేమోనన్న అనుమానం వస్తోంది. ఇది ఆయన చేజేతులా చేసుకున్నట్లే అనిపిస్తుంది. తను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్న వైనమే ఆయనను గందరగోళంలోకి నెడుతోంది. నటనలో ఆయనకు మంచిపేరే ఉండవచ్చు. రాజకీయాలలో ఆయన ఇంకా ఓనమాలు నేర్చుకోలేదనిపిస్తుంది. పేరుకు పదిహేనేళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఆయనకు అలవాటైంది.. ఎవరో ఒకరికి భజన చేయడం, లేదా ఎవరో ఒకరిని నోటికి వచ్చినట్లు దూషించడం తప్ప ఒక ప్రణాళికబద్దంగా రాజకీయం నడపడం ఆయనకు చేతకాదని పదే-పదే రుజువు చేసుకుంటున్నారు. తాను పిఠాపురంలో పోటీ చేయదలచినప్పుడు స్థానికంగా అక్కడ ఉండే తన పార్టీ నేతలతో, అలాగే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం నేతలతోను సత్సంబంధాలు పెట్టుకుని సంప్రదింపులు జరిపి ఉండాలి. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పర్యటనలు చేయడం, స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం చేయాలి. అదేమి చేయలేదు.. అసలు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా, కేవలం ఒక సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారన్న భావనతో, తాను అక్కడికి వెళ్లగానే అంతా ఎగబడతారని ఆయన అనుకుని ఉండాలి. పవన్ తనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించుకోగానే పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అనుచరులు రచ్చ-రచ్చ చేసి ఆయన గాలి తీసేశారు. చంద్రబాబును, పవన్‌ను కలిపి బండబూతులు తిట్టారు. తదుపరి రెండు రోజులకు వర్మను చంద్రబాబు నాయుడు పిలిచి ఏదో సర్దిచెప్పి పంపించారు. దాంతో అంతా చల్లారిందనుకుంటే, మరో వివాదం తెచ్చిపెట్టుకున్నారు. తాను పార్లమెంటుకు వెళితే పిఠాపురం సీటును జనసేన స్థానిక నేత ఉదయ్ శ్రీనివాస్‌కు ఇస్తానని, అసెంబ్లీకే వెళితే ఉదయ్ లోక్ సభకు పోటీ చేస్తారని అన్నారు. ఇక్కడే వర్మకు మళ్లీ మండింది. పవన్‌కల్యాణ్ లోక్ సభకు పోటీచేస్తే పిఠాపురం సీటు తనకే ఇస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన వెల్లడించారు. పవన్ అయినా చంద్రబాబు చెప్పినట్లు వినాల్సిందేనని అన్నారు.. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారనే కదా! ఒకసారి పిఠాపురం జనసేనకు కేటాయించాక మళ్లీ వర్మకు ఆశ చూపించడం ఏమిటి? పైకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అంతర్గతంగా పవన్ అక్కడ ఉండడులే అన్న సంకేతం ఇవ్వడం ఏమిటి? పవన్ చేసిన మరో తప్పిదం ఏమిటి? టీడీపీతో పొత్తు పదేళ్లు ఉంటుందని ప్రకటించడం. అంటే దీనిని బట్టి పొత్తులో ఉన్న సీట్లలో రెండో పార్టీకి, ఇప్పుడే కాకుండా వచ్చేఉపదేళ్లలో జరిగే రెండు ఎన్నికలు కూడా అవకాశం ఉండదన్నమాటే కదా! ఉదాహరణకు పిఠాపురం సీటును తీసుకోండి. పవన్‌కల్యాణ్ లేదా ఉదయ్ ఇక్కడ నుంచి ఈసారి పోటీచేస్తారనుకుందాం. పవన్ చెప్పినదాని ప్రకారం 2029, 2034 లలో కూడా అదే ప్రకారం జనసేనే తీసుకుంటుందని కదా? అప్పుడు వర్మ వంటి నేతల పరిస్థితి ఏమిటి? రాజకీయంగా అవకాశాలు ఉండవనే కదా? ఆయన అనుచరులు ఇందుకు అంగీకరిస్తారా? ఇప్పుడే పవన్ లేదా, జనసేన అభ్యర్ధి ఎవరైతే వారిని ఓడిస్తే వచ్చే ఎన్నికలకు తమకు ఇబ్బంది ఉండదని అనుకోరా! అసలు ఐదేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరైనా చెబుతారా? ఆ మాటకు వస్తే 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్‌కల్యాణ్ 2019లో ఆ రెండిటికి దూరం అయి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీచేశారు కదా. అది చంద్రబాబుకు ఉపయోగపడాలన్న లక్ష్యమే కావచ్చు. కాని అధికారికంగా అయితే పొత్తు లేదు కదా! మళ్లీ 2024కి టీడీపీ, బీజేపీలతో అవగాహన పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో వచ్చే పదేళ్లు తాను పిఠాపురంలోనే ఉంటానని చెబితే వేరే పార్టీవారు అంగీకరిస్తారా? ఈ మాత్రం ఆలోచన పవన్‌కు లేకపోయింది. మరో సంగతి చూద్దాం... తనకు లక్ష మెజార్టీ వస్తుందని ఒకసారి అంటారు. తనను ఓడించడానికి ఇంటికి లక్ష ఇవ్వబోతున్నారని మరోసారి అంటారు. వైసీపీ అభ్యర్ధి 2009లో ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాలలోకి వచ్చారని, అందువల్ల ఆమె జనసేనలో చేరాలని ఆయన అన్నారు. ఇది ఎంత తెలివితక్కువతనం. నిజానికి వంగా గీత 1994 నుంచి టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ పక్షాన తూర్పుగోదావరి జడ్పి చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారు. తదుపరి ఆమె ప్రజారాజ్యంలో చేరి పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు. ఈ చరిత్ర తెలుసుకోకుండానే ఆయన మాట్లాడేసరికి వంగా గీత ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పవన్‌ను వైసీపీలోకి రమ్మంటే బాగుంటుందా? అన్న ప్రశ్న వేశారు. తాను గెలవడం ఖాయమని, మెజార్టీ ఎంతన్నదే ప్రశ్న అని ఆమె అన్నారు. పవన్‌కు తన గెలుపుపై ఏదో భయం రాబట్టే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని తన పార్టీలోకి రావాలని బతిమలాడుతున్నట్లు మాట్లాడారు. నిజంగా గెలుపు ధైర్యం ఉంటే ఎవరినైనా ఎదుర్కుంటానని చెప్పాలి. పైగా ఎంపీగా పోటీ చేయాలని అమిత్-షా చెబితే అలాగే చేస్తారట. అంటే పిఠాపురంలో పోటీలో ఉంటానో, లేదో అని సస్పెన్స్‌లో పెట్టినట్లే కదా! ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా? నిజానికి తన పార్టీలో ఎవరు ఎక్కడ పోటీచేయాలో వేరే పార్టీవారు చెప్పడం ఏమిటి? అసెంబ్లీ టిక్కెట్లు ఏమో చంద్రబాబు సలహా మేరకు ఇస్తారా? ఎంపీ సీట్లు అమిత్-షా సూచన ప్రకారం చేస్తారా? జనసేనకు సొంత ఆలోచన ఉండదా? టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికి జనసేన టిక్కట్లు ఇస్తుంటే అసలు పార్టీ నేతలు నెత్తి, నోరు మొత్తుకుంటున్నారు. పిఠాపురంలోనే ఉంటానని ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎలా నమ్మాలి? ఆయన సినిమా షూటింగ్‌లు మానుకుని పిఠాపురంలో ఉంటానని చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? అసలు ఐదేళ్లుగా తాను మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నప్పుడు ఒక నియోజకవర్గం ఎంపిక చేసుకుని అక్కడ కేంద్రీకరించి తగు ఏర్పాట్లు చేసుకోవాలి కదా! అదేమి చేయలేదు. ఇప్పుడు సడన్‌గా వచ్చి ప్రజలంతా తన వెంట ఉండాలని అంటే, ప్రత్యేకించి ఒక కులం వారంతా తనకు మద్దతు ఇవ్వాలంటే ఇవ్వడానికి వాళ్లేమేనా పిచ్చోళ్లా? నిజమే. కొంతకాలం క్రితం వరకు ఆ వర్గంలో పవన్‌పై ఒక ఆశ ఉండేది. ఈయన తమకు ఇష్టం లేకపోయినా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఒక అరవై సీట్లు తెచ్చుకుని, సీఎం సీటులో వాటా కోరతారు అనుకుంటే, పూర్తిగా దిగజారిపోయి జనసేనను చంద్రబాబు కాళ్లదగ్గర పడేశారే అన్న బాధ వారిలో ఏర్పడింది. దాంతో ఆ వర్గంలో కూడా పవన్ పట్లవిముఖత ఏర్పడింది. ఇరవైనాలుగు సీట్లకు ఒప్పుకుని, తర్వాత దానిని 21 సీట్లకు తగ్గించడం, తనను ఎవరూప్రశ్నించరాదని అనడం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలుస్తానని చెప్పి కలవకుండా అవమానించడం వంటి ఘట్టాలతో ఈయనపై పూర్తిగా అపనమ్మకం ఏర్పడింది. గతంలో కాపు ఉద్యమం జరిగితే కనీసం ఇటువైపు తొంగిచూడని పవన్‌కల్యాణ్ ఇప్పుడు తమను ఏమి ఉద్దరిస్తారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే పవన్‌కల్యాణ్ భయపడుతున్నట్లుగా అర్ధం అవుతుంది. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి వైసీపీ నేతలు మొహరిస్తున్నారని వాపోతున్నారు. ఇందులో తప్పేమి ఉంటుంది. ప్రత్యర్ది పార్టీవారిని ఓడించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. ఆయన కూడా రాష్ట్రం అంతా తిరిగి వైసీపీని పాతాళానికి తొక్కేస్తా అంటూ ఎలా చెప్పారు? అంటే రాజకీయంగా కనీస అవగాహన లేకుండా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారని తేలిపోతుంది. పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కానప్పుడు తాము ఎందుకు ఆయనకు మద్దతు ఇవ్వాలని పిఠాపురం ప్రజలలో ఆలోచన వచ్చింది. అలాగే టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఈ నేపధ్యంలో పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తారా? లేదా? అన్నది మళ్లీ అనుమానంగా మారింది. దానికి కారణం ఎక్కడ పోటీచేసినా గెలుస్తానో, లేదో అన్న సందేహం వపన్‌ను వెంటాడుతుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
పిఠాపురంలో వంగా గీత క్యాంపెయిన్
-
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్
-
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ
-
ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ
-
పిఠాపురంలో పవన్ కు బిగ్ షాక్...
-
పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు -
ప్రాణాల మీద ఆశ.. నడి సంద్రంలో 12 గంటల పాటు మృత్యు పోరాటం
పిఠాపురం: ప్రాణాల మీద ఆశ అతడిలో మనోధైర్యాన్ని తట్టి లేపింది. ఎలాగైనా బతకాలనే పట్టుదల నడి సంద్రాన్ని ఎదురీదేలా చేసింది. 12 గంటల పాటు సముద్రంలో ఆ మత్స్యకారుడు చేసిన సాహసమే అతడి ప్రాణాలను రక్షించింది. ఈ సంఘటన కాకినాడ సమీపంలో నడి సంద్రంలో జరిగింది. దీనికి సంబంధించి తోటి మత్స్యకారులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పలువురు కాకినాడ శివారు రేపూరుకు చెందిన గేదెల అప్పారావుతో కలిసి బోటుపై మంగళవారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. కాకినాడ తీరానికి సుదూర సముద్రంలో రాత్రి 8 గంటలకు చేపల కోసం సముద్రంలో వల వేసి బోటులో అందరూ పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అందరూ లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఉప్పాడ, అంతర్వేదిలో తోటి మత్స్యకారులకు చెప్పగా వారు మరో బోటుపై వెళ్లి అప్పారావు కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఇంతలో అంతర్వేది తీరం నుంచి చిన్న తెప్పపై చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు నడి సంద్రంలో ఓ వ్యక్తి తేలియాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని తమ తెప్పలోకి ఎక్కించుకోగా కొన్ని క్షణాల్లోన్నే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మత్స్యకారుల సపర్యలు.. దీంతో తోటి మత్స్యకారులు అతడి గుండెలపై బలంగా గుద్ది తాగిన నీటిని కక్కించి సపర్యలు చేయడంతో అతడిలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చి 108లో రాజోలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని అప్పారావుగా గుర్తించారు. కాగా, చేపల కోసం వల వేసి అందరూ పడుకున్నాక తాను బహిర్భూమికి వెళ్లానని, ఇంతలో బోటు కదలడంతో ప్రమాదావశాత్తు సముద్రంలో పడిపోయానని అప్పారావు చెప్పాడు. 12 గంటల పోరాటం.. ఎంతసేపు ఈత కొట్టినా బోటు కనిపించకపోవడం..సముద్ర ఒడి ఎక్కువగా ఉండటంతో అలా ఈదుకుంటూ వచ్చానని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు ఈదుకుంటూ తీరం వైపు వెళుతున్న తనకు ఎండ ఎక్కడంతో ఓపిక తగ్గిపోయిందని.. దీంతో మునిగిపోకుండా తానున్న స్థలంలోనే పైకి తేలి ఉండే విధంగా ప్రయత్నం చేశానని చెప్పాడు. 12 గంటల శ్రమ అనంతరం చివరకు తనకు దూరంగా ఒక తెప్ప కనిపించడంతో చేతులు పైకి ఊపుతూ రక్షించమని అడిగానని..ఆ తెప్పలో ఉన్నవారు తనని కాపాడారని అప్పారావు చెప్పాడు. ఇది కూడా చదవండి: 'ఫ్యామిలీ డాక్టర్' పథకంతో మంచి ఫలితాలు.. ఆరేళ్లు దాటాక కూడా ప్రత్యేక శ్రద్ద -
పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస
-
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా దసరా వేడుకలు
-
చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడు. మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమే. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం. వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం.. కాపు నేస్తం అందులో భాగమే!: సీఎం జగన్ -
ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం అందించాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ధి చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
వైఎస్సార్ కాపు నేస్తం: మూడో విడత నగదు విడుదల
కాపు నేస్తం మూడో విడత కార్యక్రమం.. అప్డేట్స్ 12:27PM ►వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధుల జమ ►లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సీఎం జగన్ ►అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయం 11: 55AM ►వైఎస్సార్ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ►మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ. 45 వేలు ఇచ్చాం: సీఎం జగన్ ►ఇప్పటివరకూ వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం: సీఎం జగన్ ►నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►నాన్ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి రూ. 508.18 కోట్ల లబ్ధి: సీఎం జగన్ 11:49AM ►మహిళా సాధికారత పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు. మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చారని, లంచాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని వంగా గీత తెలిపారు. 11:46AM ► ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అని లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా. 11:43 AM ► కాపులను చంద్రబాబు మోసం చేశాడు. చాలా హింసించాడు. కాపుల సంక్షేమం కోసం ఆలోచించిన గొప్పమనసు సీఎం జగన్‌ది. మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో చాలా లబ్ధి పొందుతున్నాం. మా అందరికీ మీరు పెద్ద కొడుకుగా భావిస్తున్నాం. ::బండారు సుజాత, కాకినాడ అర్బన్ 11:38 AM కాపులు.. పవన్‌ను నమ్మొద్దు: మంత్రి దాడిశెట్టి రాజా ► కాపుల కోసం గత ప్రభుత్వాలు ఎన్నో రకాల మాటలు చెప్పాయి. చేతల్లో చూపించింది శూన్యం. అధికార మదంతో కాపుల మీద కేసులు కూడా పెట్టారు. కానీ, ఈ మూడు సంవత్సరాల్లో కాపుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అంతేకాదు కేసుల్ని కూడా ఎత్తేయించారు. పవన్ కల్యాణ్ మోసపు మాటలను నమ్మొద్దని.. చంద్రబాబుతో చేతులు కలుపుతున్నాడని.. ఎల్లోమీడియా, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇలా ఎందరు కలిసొచ్చినా.. కాపు సంక్షేమం కోసం వైఎస్ జగన్నే మనం మళ్లీ సీఎంగా చేసుకోవాలని పిలుపు ఇచ్చారు మంత్రి దాడిశెట్టి రాజా 11:33 AM ► కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది. రూ. 422 కోట్ల రూపాయలతో హార్బర్ ఇచ్చారు. అలాగే సాగరమాల రోడ్డు ప్రకటించారు. గతంలో మహానేత వైఎస్సార్ కూడా ఇలాగే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఉపయోగపడే మరికొన్ని పనులను పూర్తి చేయించాలని సీఎం జగన్‌ను వేదిక నుంచే కోరారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ► వైఎస్సార్ కాపు నేస్తం మీద స్పెషల్ ఏవీ ప్రదర్శన 11:27 AM ► వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత కార్యక్రమంలో.. కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా అందడానికి.. పాలనా సౌలభ్యం కోసం కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినందుకు ఆమె సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు మహిళా పక్షపాతిగా ఉన్న ఆయనకు ధన్యవాదాలు చెబుతూ.. ప్రజాసంక్షేమ ఆశయానికి తగట్లుగా పని చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. 11:25 AM ► మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి.. స్థానిక నేతలు, అధికారులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు సీఎం జగన్. 11:19 AM ► కాపు నేస్తం మూడో విడతలో.. అర్హులైన మూడు లక్షల మందికి పైగా రూ.500కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ► ఇప్పటివరకు వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,491 కోట్ల రూపాయల సాయం అందించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. 11:15 AM ► గొల్లప్రోలు సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్. ఆడపడుచులతో ఫొటోలు దిగి.. ఆప్యాయంగా పలకరించిన జగనన్న. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం. 11:00 AM ► హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్‌షో. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడుత సాయం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్. 10:58 AM ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్‌రెడ్డి. 10:47 AM ► కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. 10:00 AM ► వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు. ► వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ► కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో.. సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు జమ చేయనున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ► మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు. పర్యటన ఇలా.. ► శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి, కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేరుకుంటారు. ► లబ్ధిదారులను ఉద్దేశించి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు. ► కార్యక్రమ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు'
సాక్షి, శంఖవరం/పిఠాపురం: ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలైన సంఘటన కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్ సమీపాన చోటుచేసుకుంది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన మేడపోతుల శివ ఈశ్వరుడు (38) లారీ డ్రైవర్‌గా, ఆకుల రామ్‌కుమార్ (35) క్లీనర్‌గా పని చేస్తున్నారు. వారు ఆదివారం కత్తిపూడిలోని ఒక డీలర్ వద్ద లారీలో డ్రింకులు లోడు చేసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లారీపై టార్పాలిన్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో తీవ్రస్థాయిలో విద్యుదాఘాతానికి గురైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీఐ కిశోర్‌బాబు, అన్నవరం ఎస్సై రవికుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు) మృతుల్లో ఒకరైన శివ (పాతచిత్రం) ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు మృతులిద్దరిదీ చిన్నప్పటి నుంచీ మోటారు ఫీల్డే. వాస్తవానికి ఒకరు లారీ డ్రైవర్. మరొకరు ట్రాక్టర్ డ్రైవర్. ఒక్కోసారి ఇద్దరూ కలిసి డ్రైవర్, కీనర్లుగా లారీపై వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం లారీపై డ్యూటీకి బయలుదేరారు. ఎంత లేటైనా రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. ఈ ప్రమాదంతో కొత్త ఇసుకపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు శివ ఈశ్వరుడికి భార్య శాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు రామ్‌కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, అప్పుడప్పుడు లారీపై క్లీనర్‌గా వెళ్తూండేవాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, ఇక తమకు దిక్కెవరని ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టిస్తోంది. -
రెండు చోట్లా ఓడిపోయినా సిగ్గు రాలేదు
-
పగిలిన కోవిషీల్డ్ వ్యాక్సిన్
సాక్షి, పిఠాపురం: స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వయల్స్ పగిలిపోయిన సంఘటన వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. ఆలస్యంగా తెలిసిన వివరాల మేరకు.. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి నుంచి 6 వయల్స్‌ను ప్రత్యేక బాక్సులో విరవ ఆస్పత్రి హెల్త్ సూపర్వైజర్ రమణ, హెడ్ కానిస్టేబుల్ ఏసు విరవ ఆస్పత్రికి ఆదివారం తీసుకువెళ్లారు. వైద్య సిబ్బంది వాటిని తెరచి చూడగా 3 వయల్స్ పగిలిపోయి ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పగిలిన మూడు వయల్స్‌తో 30 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అవి పగిలిపోవడంతో విచారణ చేపట్టారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై పార్థసారథి తన సి బ్బందితో ఆస్పత్రికి వెళ్లి జరిగిన సంఘటనపై వై ద్యాధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. అయితే, హెల్త్ సూపర్వైజర్ రమణ పిఠాపు రం నుంచి వ్యాక్సిన్ తీసుకువస్తుండగా ప్రమాదం జరిగి వ్యాక్సిన్ ఉన్న బాక్స్ కింద పడిపోయిందని, దీనివల్ల మూడు వయల్స్ పగిలిపోయాయని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలిపారు. -
కుప్పకూలిన వంతెన
సాక్షి, సామర్లకోట: పిఠాపురం రోడ్డులో ఏలేరు కాలువపై ఉన్న ఇరుకు వంతెన శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో టిప్పర్ వెళ్తుండగా.. ఆ బరువుకు వంతెన కూలిపోయింది. దీంతో టిప్పర్ ఏలేరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో పిఠాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటిష్ కాలంలో ఈ వంతెనను నిర్మించారు. ఇది శిథిలావస్థకు చేరిన విషయమై గతంలో నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘సాక్షి’ దినపత్రిక వివిధ కథనాలు ప్రచురించింది. ఈ వంతెన దుస్థితిపై హెచ్చరించింది. అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజప్ప ఈ వంతెనను ఒక్కసారి కూడా పరిశీలించలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదల కారణంగా ఏలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రవాహ ఉద్ధృతికి వంతెన మరింత దెబ్బతింది. దీని దుస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు కొత్త వంతెన నిర్మించాలని ఆర్అండ్బీ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీని నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ప్రకటించారు. ఇంతలోనే వంతెన కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సుమంత్, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వంతెన పైనుంచి పడిన టిప్పర్‌లో ఉన్న డ్రైవర్ అశోక్‌ను, క్లీనర్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. వారిద్దరూ ఏలేశ్వరానికి చెందిన వారని తెలిపారు. వంతెన కూలిపోవడంతో బ్రౌన్‌పేట వద్ద, పిఠాపురం నుంచి వచ్చే వాహనాలు రాకుండా జల్లూరు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మేరకు పిఠాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిఠాపురం వెళ్లే వాహనాలను మరో మార్గంలో మళ్లించారు. -
మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహనరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో కరోనా వైరస్ కేసులు వెయ్యి దాటాయి. ఇప్పటి వరకు 98, 340 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా, 1,060 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 663 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 386 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అధికారులు 130 చోట్లను కంటైన్మెంట్గా ప్రకటించారు. సామర్లకోట అమ్మణ్ణమ్మ గృహ సముదాయంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కాకినాడ జగన్నాథపురాన్నిఅధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మెయిన్‌రోడ్డులోని షాపులను అధికారులు మూసివేశారు. (ఏపీలో మరో 796 కరోనా కేసులు) మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రకటించారు. ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరవాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 12 గంటల నుంచి ప్రజలు రోడ్డు మీదకు రావొద్దని ఎమ్మెల్యే దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేటలో వెండి నాణేలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్ర ఉంపన్ తుపాన్ కారణంగా సముద్రంలోని అలల తాకిడికి కోనపాపపేట తీరంలో పలు ఇళ్లు నేల కూలిపోయాయి. అయితే ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు బుధవారం రాత్రి నుంచి తీరంలో వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం వారు చాలా ధనవంతులని, ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టి ఉన్నారేమో అని ప్రచారం కొనసాగుతోంది. బయటపడ్డ ఈ వెండి నాణేల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఉంపన్’ తీరం దాటిన విషయం తెలిసిందే. -
ఆధ్యాత్మిక కేంద్రంలో.. అలజడి
తూర్పుగోదావరి, పిఠాపురం: ఆధ్యాత్మిక కేంద్రం. అనేక ప్రాచీన ఆలయాలకు నిలయమైన పిఠాపురంలో హిందూ దేవాలయాలపై కుట్రలు జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దొరికిన చోటల్లా కనిపించిన ప్రతి హిందూ దేవతల విగ్రహాన్ని ఇష్టమొచ్చినట్టు ధ్వంసం చేసిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే పిఠాపురంలో అలజడులు సృష్టించడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ విధ్వంసం వెనుక అదృశ్య శక్తులున్నట్టు ప్రచారం జరుగుతోంది. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి పశువుల సంత వరకు ఉన్న ఎనిమిది ఆలయాలకు చెందిన 12 హిందూ దేవతల విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. పట్టణంలో ఉప్పాడ బస్టాండ్ నుంచి ఉన్న రామకోవెలల వద్ద బయట ఉన్న వివిధ దేవతామూర్తుల టైల్స్ బొమ్మలను విరగ్గొట్టిన అగంతకులు దొరికిన చోటల్లా విధ్వంసం సృష్టించారు. ఆలయాల వద్ద ఉన్న ఫ్లెక్సీలతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన ఫ్లెక్సీలను, ఆలయాల గోడలకు ఉన్న టైల్స్ బొమ్మలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంఘటన స్థలాలను క్లూస్‌టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూపరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిఠాపురంలో ధర్నా నిర్వహించారు. పిఠాపురం సీఐ అప్పారావు సంఘటన స్థలాలను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో నేరస్తులను పట్టుకుంటామని ఎటువంటి అలజడులకు గురికావద్దని పట్టణ వాసులకు విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల పరిశీలన విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు వ్యాపార సంస్థల సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించినా ఫలితం కనిపించలేదంటున్నారు. వాస్తవానికి గతంలో పట్టణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. కానీ ఎక్కడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ సంఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సీసీ కెమెరాలు ఉండి ఉంటే కచ్చితంగా దోషుల వివరాలు తెలిసి ఉండేవి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి విగ్రహాల ధ్వంసం ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు పోలీసు అ«ధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన జరిగిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గతంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. రాత్రి గస్తీ ఏమైనట్టు..? పట్టణంలో మెయిన్ రోడ్డులో ఇంత దారుణంగా అనేక విగ్రహాలను పగుల గొట్టినా గస్తీలో ఉన్న పోలీసులు ఏమి చేస్తున్నారని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తుండగా ఆ సమయంలో గస్తీ తిరగాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఆలయ భూముల్లో అక్రమాలకు చెక్
కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూములను రైతులు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూములకు శిస్తు రూపంలో ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో సాధారణ రైతుల మాదిరిగానే ఆలయాల భూములు సాగు చేసే రైతులకు కూడా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తద్వారా శిస్తు సక్రమంగా వసూలయ్యే అవకాశముంటుందని అధికారులు గుర్తించారు. పైగా దీనివలన రైతులకు కూడా ప్రభుత్వ పరంగా రైతు భరోసా వంటి పథకాలు వర్తించనున్నాయి. దీంతో దేవదాయ శాఖ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సాక్షి,పిఠాపురం(తూర్పుగోదావరి) : దేవాలయాలకు చెందిన భూములు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆలయ భూములు సాగు చేసే వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి చర్యలు ఆరంభించింది. ఇందులో భాగంగా దేవాలయ భూములను సాగు చేసే రైతుల సమగ్ర వివరాలను ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు అందజేస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు ఆ పనిలో తలమునకలయ్యారు. మన జిల్లాలోని 1,724 ఆలయాలకు సుమారు 22,695 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవికాకుండా భక్తుల నుంచి నిత్యం లభించే ఆస్తులు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం భూములు ఎక్కువ శాతం అన్యాక్రాంతమై దళారుల చేతుల్లో మగ్గిపోతున్నాయి. గతంలో కొందరు దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి, తక్కువ కౌలుకు ఏళ్ల తరబడి ఇతరులకు ధారాదత్తం చేయడంతో దేవాలయాలకు చెందిన అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. వారికి రైతు భరోసా! కౌలు అర్హత కార్డులను ప్రభుత్వం జారీ చేస్తే ఆలయాల భూముల వివరాలు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనివలన భూమి శిస్తు కూడా సక్రమంగా వసూలవుతుందని భావిస్తున్నారు. తద్వారా ఆలయాలకు ఆదాయం పెరుగుతుంది. మరోపక్క నిజమైన కౌలు రైతుకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ రైతు భరోసా సహాయం కూడా అందుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ఆలయ భూములు సాగు చేసే రైతులకు కౌలు అర్హత కార్డులు ఇవ్వాలని, తద్వారా వారికి కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు అర్హులైన కౌలు రైతులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారికి వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు. అందరు బయటపడతారా? ఇప్పటికే దేవుడి భూములను అప్పనంగా పండించుకుంటున్న కొందరు రైతులు కౌలు గుర్తింపు కార్డుల కోసం బయటపడతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అర్హత కార్డు తీసుకోవాలంటే తాము ఎంత భూమి సాగు చేస్తున్నదీ అధికారికంగా రికార్డుల్లో చూపించాల్సి ఉంటుంది. దీంతో కొందరు ఈ కార్డులు తీసుకోడానికి సుముఖత చూపరనే వాదనలు కూడా ఉన్నాయి. శిస్తు సక్రమంగా చెల్లించేవారు ముందుకు వచ్చినా, శిస్తు ఎగ్గొట్టేవారు మాత్రం ముందుకు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ అధికారులు మాత్రం రెవెన్యూ రికార్డుల ఆధారంగా అన్ని భూములకు సంబంధించిన రైతుల వివరాలను బహిర్గతం చేయాలని భావిస్తున్నారు. వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం దేవస్థానం భూములు సాగు చేస్తున్న రైతుల్లో సక్రమంగా శిస్తు చెల్లిస్తున్న వారికి దేవదాయ శాఖ తరఫున సర్టిఫికెట్లు ఇస్తున్నాం. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు కౌలు అర్హత కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. కొందరు రైతులు వచ్చి తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. వారి వివరాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఆ సర్టిఫికెట్ ఉన్న ప్రతి కౌలు రైతుకూ ప్రభుత్వం అందించే వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయం అందుతుంది. – నరసింహారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్, కాకినాడ -
పదోన్నతి పొంది.. అంతలోనే విషాదం
పోలీస్...ఆ మూడు అక్షరాలు సాధనేతన ధ్యేయంగా భావించింది ఖాకీ దుస్తులే తనకు కవచ కుండలాలనుకుంది లాఠీ...శాంతి, భద్రతల అదుపునకు వజ్రాయుధమనుకుంది విజిల్...కూత ట్రాఫిక్ నియంత్రణకు లక్ష్మణ రేఖగా భాసించింది ,పేదరికమనే అవరోధం ఆడపిల్లనే ఆక్షేపణం అడుగడుగునా అడ్డుగా నిలిచినా అధిగమించి, అరోహించి ‘స్టార్’గా నిలవాలనే లక్ష్యం సాధించి పదోన్నతి సాధించి...అందరికీ ఆనందం పంచి అంతలోనే విషాదం నింపి జీవనం పయనం చాలించి...(పిఠాపురం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న విజయలక్ష్మి విధి నిర్వహణలో ఉండగానే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది... ఆ ఫలాలు ఆస్వాదించకుండానే లారీ చక్రాల కింద బంగారు భవిత నలిగిపోయింది.) సాక్షి, తూర్పుగోదావరి(రంగంపేట) : రంగంపేట శివారు అట్టల ప్యాక్టరీ వద్ద ఏడీబీ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. రంగంపేట ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళాహెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కూటి విజయలక్ష్మి (47)గురువారం రాజమహేంద్రవరం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తన హోండా యాక్టివా బైక్‌పై వెళుతుండగా ఉదయం తొమ్మిది గంటలకు రంగంపేట శివారు అట్టల ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి పెద్దాపురం నుంచి రాజానగరం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీ కొట్టింది. విజయలక్ష్మిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. టైర్ల కింద ఇరుక్కుపోయి ఆమె చనిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. రంగంపేట వీఆర్వో శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రంగంపేట ఇన్చార్జి ఎస్సైగా ఉన్న సామర్లకోట ఎస్సై వీఎల్‌వీకే సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మహిళా హెడ్‌కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పెద్దాపురం: స్థానిక ఏడీబీ రోడ్డులో రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిఠాపురం పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కె.విజయలక్ష్మి మృతదేహాన్ని గురువారం జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోలీస్ యంత్రాంగం నుంచి అందించాల్సిన సహాయక చర్యలు చేపట్టి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్బీ డీఎస్పీ సుంకర మురళీమోహన్, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్సై వెలుగుల సురేష్ తదితరులున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ విజయలక్ష్మి మృతి చెందడంతో ప్రమాదస్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సందర్శించారు. -
అల్లుడిని చంపిన మామ
సాక్షి, పిఠాపురం రూరల్(తూర్పు గోదావరి): పిఠాపురం మండలం ఎల్ఎన్ పురంలో పిల్లనిచ్చిన మామే సొంత అల్లుడిని హతమార్చిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్ఎన్ పురానికి చెందిన మృతుడు యలమంచిలి రాజు (36)కు అదే గ్రామానికి చెందిన తప్పిట చంద్రరావు కుమార్తె గాయత్రితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి. కాకినాడలోని వెల్డింగ్ పనిచేసే రాజు కొన్నాళ్లుగా మద్యం సేవించి భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి బుధవారం రాత్రి తన అత్తగారి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన మామ చంద్రరావుపైనా దాడి చేయడంతో క్షణికావేశంలో మామ పక్కనే ఉన్న గునపంతో అల్లుడి తలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చైతన్యకుమార్, ఇన్చార్జి గోవిందరాజు పరిశీలించారు. మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్‌ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు. -
పిఠాపురం ఎమ్మెల్యేపై కేసు నమోదు
-
పది పరీక్ష ముగించి.. జీవిత పరీక్షలో తలవంచి..
సాక్షి, కొత్తపల్లి : పదో పరీక్షలు రాసిన ఆ పాఠశాల విద్యార్థులందరూ వీడ్కోలు సంబరంలో సరదాగా గడిపారు. భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ విద్యార్థులందరూ గురువుల ఆశీస్సులు అందుకున్నారు. పదేళ్లు కలిసి చదువుకున్న వారందరూ ఒకరినొకరిని వీడలేక.. బరువెక్కిన హృదయాలతో పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు. వారందరికీ టాటా చెబుతూ ఇంటికి బయలుదేరిన వారిద్దరినీ మృత్యువు కాటేసింది. విషయం తెలిసిన బంధువులతో పాటు సహచర విద్యార్థులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన పులపకూర శేఖర్ (16) అమ్మయ్య ఊరు యండపల్లి శివారు జొన్నల గరువులో ఉంటూ కొండెవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. అదే గ్రామం జోగిరాజు పేటకు చెందిన బోరపాటి అనూష (16) ఈ పాఠశాలలోనే 10వ తరగతి చదివింది. బుధవారం 10వ తరగతి పరీక్షలు ముగియడంతో గురువారం పాఠశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫేర్వెల్ నిర్వహించుకున్నారు. అప్పటివరకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆనందంగా గడిపిన వారి ఇద్దరూ పార్టీ ముగించుకుని మోటర్ సైకిల్‌పై ఇళ్లకు బయలుదేరారు. స్థానిక యాక్సస్ బ్యాంక్ సమీపంలో ఉప్పాడ నుంచి పిఠాపురం వైపు వెళుతున్న ఆటోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అనూష, మల్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆటో డ్రైవర్‌ను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో రోడ్డుప్రమాదంలో... ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వాకతిప్ప సతీష్ చంద్ర కాలనీకి చెందిన కేశనకుర్తి తాతారావు (56) సైకిల్‌పై ఉప్పాడ వెళుతున్నాడు. అనంతలక్ష్మి కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరోసారి బట్టబయలైన టీడీపీ - జనసేన బంధం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన స్థానిక జనసేన నేత ఒకరు శుక్రవారం వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా వర్మ ఆయనతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ స్నేహితులేని, ఎన్నికల తరువాత వారిద్దరూ కలిసే ఉంటారని అన్నారు. ఇంకా కొంతమంది ఉంటే టీడీపీలో చేర్పించాలని.. జనసేన కూడా మనతో కలిసే పార్టీయేనని చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య బంధం ఇంకా కొనసాగుతూనే ఉందని విశాఖ టీడీపీ ఎన్నికల పరిశీలకు మెట్ట సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య మంచి అవగహన ఉందని.. దాని ప్రకారమే సీట్ల ఒప్పందం కూడా జరిగిందని ఆయన తెలిపారు. టీడీపీకి చెందిన కీలక నేత పవన్, బాబు మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేయడంతో ఇన్నేళ్లు జరుగుతున్న ప్రచారం నిజమైంది. కాగా టీడీపీ, జనసే మధ్య ఉన్న అతర్గత ఒప్పందం ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సీట్ల పంపిణీ విషయంలో కూడా ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందం. ఒక్కో ఘటన బయటపడుతుండడంతో నిజమైన జనసేన శ్రేణులు నివ్వెరపోతున్నాయి. కాగా నిజంగానే బాబుతో విభేదించి బయటకు వచ్చారని, నిజమైన ప్రత్యామ్నాయం కోసం పవన్ కల్యాణ్ తపనపడుతున్నాడని నమ్మిన ఆయన అనుచరులు కంగుతింటున్నారు. -
మరోసారి బట్టబయలైన టీడీపీ జనసేన మైత్రి
-
ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు
-
228వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
228వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, పిఠాపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
227వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
227వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గొల్లప్రోలు మండల శివారు నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గొల్లప్రోలు నుంచి చెందుర్తి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. -
నిద్రపోయిన మహిళ మెడ, చేతులు నరికి...
ఆ భార్యాభర్తలిద్దరూ కలసి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చారు. భర్త టీవీ చూస్తుండగా, భార్య నిద్రకు ఉపక్రమించింది. ఈలోగా ఏం జరిగిందో ఏమో! తెల్లారేసరికి భార్య రక్తపు మడుగులో ఉంది. భర్త కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన పిఠాపురం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురం టౌన్ : మండలంలోని ఎఫ్‌కే పాలెం గ్రామానికి చెందిన ముమ్మిడి సుబ్రహ్మణ్యం(42)తో కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఒడిశాలోని బిలాస్పూర్లో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలతో కలసి సుబ్బలక్ష్మి స్థానిక బైపాస్ రోడ్డులోని గోపాలబాబా ఆశ్రమానికి ఎదురుగా ఉన్న తమ ఇంటి మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. భర్త సుబ్రహ్మణ్యం బిలాస్పూర్ నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూండేవాడు. భార్యాభర్తలిద్దరి మధ్య స్వల్ప తగాదాలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల సుబ్బలక్ష్మి తన పిల్లలతో కలసి బిలాస్పూర్ వెళ్లింది. భర్తతో గొడవ పడి నాలుగు రోజుల క్రితం పిల్లలను అక్కడే వదిలేసి ఒంటరిగా పిఠాపురం వచ్చేసింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం కూడా పిల్లలను బిలాస్పూర్లోనే వదిలేసి పిఠాపురం వచ్చాడు. సుబ్బలక్ష్మి పుట్టిన ఊరయిన కొండెవరంలో శుక్రవారం జరిగిన శుభకార్యానికి భార్యాభర్తలిద్దరూ వెళ్లి, రాత్రి పది గంటల సమయంలో తిరిగి పిఠాపురంలోని ఇంటికి చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం టీవీ చూస్తుండగా, సుబ్బలక్ష్మి నిద్రపోయింది. తెల్లారేసరికి నిద్రమత్తు వీడిన సుబ్బలక్ష్మి.. చూసుకొనేసరికి రక్తపు మడుగులో ఉంది. పక్కనే ఉండాల్సిన భర్త కనిపించకుండా పోయాడు. దీంతో భీతిల్లిన ఆమె ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి భయాందోళనతో కేకలు వేసింది. అది గమనించిన చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్‌ను రప్పించి తొలుత పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సుబ్బలక్ష్మిని తరలించారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఎడమచేతిలో కొంత భాగం తొలగించారు. అంతా మిస్టరీయే.. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుబ్బలక్ష్మి ముఖం మీద మత్తుమందు స్ప్రే చేసి చేతులు, మెడ మీద నరికి, భర్త సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో సుబ్బలక్ష్మి చెప్పిన సమాచారం మరోలా ఉంది. తాను నిద్రపోతుండగా ముఖం మీద ఎవరో మత్తుమందు స్ప్రే చేసినట్టు గుర్తుకు వస్తోందని, తెల్లారేసరికి చేతుల మీద, మెడ మీద కత్తితో నరికిన గాయాలున్నాయని, తెలివి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నానని సుబ్బలక్ష్మి చెప్పినట్టు పట్టణ ఎస్సై శోభన్‌కుమార్ తెలిపారు. భర్త సుబ్రహ్మణ్యం కనిపించలేదని ఆమె తెలిపిందని, ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఇన్చార్జ్ సీఐ రాంబాబు నేతృత్వంలో పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి. ఆధారాల కోసం క్లూస్ టీం అన్వేషించింది. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీస్ డాగ్ సమీపంలో ఉన్న ఆదిత్య స్కూల్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. సుబ్రహ్మణ్యం ఆచూకీ తెలిస్తేనే ఈ కేసులో మిస్టరీ వీడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భర్త లేకపోవడం, లోపల ఉండాల్సిన బైక్ కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. -
గేటు దాటితే ఖబడ్దార్!
పిఠాపురం: అది సెంట్రల్ జైలు కాదు, అలాగని నిషేధిత ప్రాంతం అసలే కాదు. హై సెక్యూరిటీ జోన్ కూడా కాదు. పోనీ కనీసం రోగులకు ఇబ్బంది కలుగుతుందనుకోవడానికి అది ఆసుపత్రి కానే కాదు. కానీ అక్కడెక్కడా లేని నిబంధనలు మాత్రం ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తప్ప ఉదయం ఎవ్వరూ అటువైపు వెళ్లరాదు. ఒకవేళ వెళదామన్నా వెళ్లనివ్వరు. అదేదో శ్రీహరికోటలోని ఉపగ్రహ తయారీ కేంద్రం అనుకుంటే పొరపాటే. అది పిఠాపురంలోని మున్సిపల్ కార్యాలయం. అక్కడకు వెళ్లాలంటే అర్జీదారులతోపాటు పురపాలక సంఘ సభ్యులు సహితం సమయ పాలన పాటించక తప్పదు. ఇందుకోసం ఉదయం నుంచీ మున్సిపల్ కార్యాలయం గేటు మూసివేసి, నిరంతరం సెక్యూరిటీ గార్డులతో కాపలా ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయంలో గేటు దాటి లోపల అడుగు పెట్టాలన్నా కూడా.. గేటు వద్ద ఉన్న సిబ్బందికి ఏ పనిమీద, ఎవరికోసం వచ్చారు? ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారనే వివరాలను కచ్చితంగా ఇచ్చి వెళ్లాలని నిబంధనలు విధించారు. ఇటీవల రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ బిల్లు కలెక్టర్ పట్టుబడిన సంఘటన జరిగిన నాటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకున్న సమయంలోనూ ఇటువంటి నిబంధనలే అమలు చేయగా.. సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో వాటిని సడలించారు. నిత్యం వివిధ పనుల కోసం వచ్చే అనేకమంది ఈ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్ వర్క్ అంటూ మూడు దాటితే సిబ్బందిలో అనేకమంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏ పని చేయించుకోవాలని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇలాంటి నిబంధన పెట్టిన స్థానిక మున్సిపల్ అధికారుల తీరును వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే మున్సిపాలిటీలో.. అందునా సుమారు 70 వేల జనాభా ఉన్న పిఠాపురంలో ప్రజాసేవకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కమిషనర్‌ను కలవడానికి మాత్రమే సమయ పాలన ఏర్పాటు చేయాలి తప్ప, ఇలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేలా నిబంధనలు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శిస్తున్నారు. ప్రజలతో ఎన్నికైన కౌన్సిలర్లకు సహితం ఈ నిబంధన విధించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. సత్వర సేవల కోసమే.. ప్రజలకు సత్వరం సేవలందించడానికే ఈ నిబంధనలు పెట్టాం. కొందరు ఏ పనీ లేకపోయినా కార్యాలయంలో గంటల తరబడి ఉండి అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దళారుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు నిర్ణీత సమయంలో అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తాం. – ఎం.రామ్మోహన్,కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ -
సంస్థానంలో టీడీపీ సభ్యుల మహా దోపిడీ
-
రాజు గారి ‘శిలా’శాసనం
మాయమవుతున్న గత పాలకుల శిలా ఫలకాలు శంకుస్థాపన రాళ్లు కనిపించకూడదట! పిఠాపురంలో నీచ సంస్కృతి రాచరికం పోయి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ ఛాయలు మాత్రం పిఠాపురం నియోజక వర్గంలో పోవడం లేదు. రాజుల పాలనలో యుద్ధాలు జరిగేవి. విజేతగా నిలిచిన రాజుదే ఆ రాజ్యం. అందుకే గత రాజుల ఆనవాలు కనిపించకుండా ధ్వంసం చేసేవారు. అదే పద్ధతిని ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రాజుగారు. శాశ్వతంగా తానే ఉండిపోతాననే భ్రమలో ఉన్నట్టున్నారు ఈ రాజుగారు. పాత శిలా ఫలకాలు ఒక్కొక్కటినీ పడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. పిఠాపురం: చరిత్రను చాటి చెప్పే శిలా శాసనాలను రాచరికంలో రాజులు వేయించుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో పాలకులు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల జ్ఞాపకాలుగా శిలా ఫలకాలను వేయించుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు కపించకూడదనేది ఇక్కడి రాజు గారి శిలాశాసనం. రెండు, మూడేళ్ల ముందు ఒకరు శంఖుస్థాపన చేస్తారు ... పూర్తయిన తరువాత ఆ రోజుకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయంలో శంఖుస్థాపన చేసినవారి పేరుతోపాటు ప్రారంభోత్సవం చేసినవారి పేరు ఉండడం సహజం. కానీ ఈయనగారు ప్రారంభించిన ఏ కార్యాలయంలోనూ తన ప్రారంభోత్సవ శిలాఫలకం తప్ప శంఖుస్థాపన శిలాఫలకం మాత్రం కనిపించకూడదనే హుకుం జారీ చేయడంతో జుత్తు పీక్కుంటున్నారు ఆయా శాఖల అధికారులు. ఈ నిరంకుశత్వ విధానాలు ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలో... ఆ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ జమానాలో ఈ తంతు సాగుతోంది. పద్థతిదీ... సాధారణంగా ఏ ప్రభుత్వ భవనమైనా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడితే ఆ సమయంలో అధికారంలో ఉన్న పాలకులు శంఖుస్థాపన చేస్తారు. ఆ భవనాలు పూర్తయ్యాక వాటిని పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏ పాలకులు కార్యక్రమంలో పాల్గొన్నా రెండు శిలాఫలకాలనూ ఆ కార్యాలయంలో శాశ్వతంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2014లో ఎన్నికలు జరిగే వరకు అలాగే కొనసాగింది కాని ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇతర నాయకులు చేసిన శంఖుస్థాపన రాళ్లు మాయమవుతుండగా కేవలం ఇప్పటి నాయకులు వేసిన ప్రారంభోత్సవ రాళ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో వేసిన శంఖుస్థాపన రాళ్లను మూలన పడేయడం ...లేదా ఎక్కడ వేసిన రాళ్లను అక్కడ వదిలేయడం జరుగుతోందంటున్నారు. . తాజా ఘటనలివీ... కొత్తపల్లి మండలంలోని మండల కేంద్రమైన కొత్తపల్లి పోలీసు స్టేషన్, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణాలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అప్పటి ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనా«థ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎట్టకేలకు ఆ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఆ భవనాలను ఎన్నికల అనంతరం కొత్త పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ కార్యాలయాల వద్ద మాత్రం గతంలో పాలకులు చేసిన శంఖుస్థాపన రాళ్లను మూడు ముక్కలు చేసి మూలన పడేయడం గమనార్హం. గతంలో కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని గతంలో పాలకులు ప్రారంభించగా అక్కడ మాత్రం శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అదే కార్యాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రస్తుత నాయకుల పేరుతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. + తాజాగా పిఠాపురం మండలంలో మంగితుర్తిలో ఒక దాత ఏర్పాటు చేసిన శిలాఫలకం తీయించేసి ఎమ్మెల్యే వర్మ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం ఏర్పాటు చేయించడం ఇందుకు తార్కాణం. ఈ తంతు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలం మారుతోంది ...ప్రభుత్వాలు మారుతుంటాయి ... నాయకులు తారుమారవుతుంటారు...అలా అని గత పాలకుల జ్ఞాపకాలను తుడిచేయాలనే కుటిల ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని ... ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. -
మూడు రోజులైనా రాని నీరు
- ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు - టీడీపీ నేతలకు భయపడడం వల్లే ఈ పరిస్థితని ఆరోపణ - ఎండుతున్న పొలాల చూసి రైతుల దిగాలు పిఠాపురం : ఏలేరు ఆయకట్టు పరిధిలో పిఠాపురం సీతారాంపురంలో నీరందక పంటలు ఎండిపోయి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతలకు భయపడి నీరివ్వడానికి వెనుకాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం వల్లే తమ పంటలు ఎండిపోయాయని చేసిన ఆరోపణల పర్యవసానంగా అధికారులు ఆ కాలువల వంక కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాలకు నీరందక రైతులు కన్నీరుమున్నీరవుతున్న వైనాన్ని ‘సాక్షి’ అధికారుల దృష్టికి తెచ్చింది. గత శనివారం ‘అందని నీరు అన్నదాత కన్నీరు’ శీర్షికన వెలువడిన కథనం నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, జేఈలు అప్పారావు, నాగేశ్వరరావు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. నీటిఎద్దడి వల్లే ఎండిపోయినట్టు నిర్ధారించారు. నెలరోజుల పాటు సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించినట్టు గుర్తించిన అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా పంటలు ఎండిపోతుంటే మీరు ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే కాలువలకు పొక్లయిన్‌తో మరమ్మతులు చేసి మిగిలిన ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గించి రెండురోజుల పాటు పొలాలకు నీరందించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన నీరు వచ్చే ఏర్పాటు చేసి వీలున్నంత వరకు నష్టం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే అధికారులు పర్యటించి మూడురోజులైనా ఇప్పటికి ఒక్క చుక్క నీరు రాలేదు. కాలువకు మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పటికే కొన్ని పంట పొలాలు పనికి రాకుండా ఎండిపోగామూడు రోజుల నుంచి మిగిలిన పొలాలు ఎండిపోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఏలేరు నీటిసంఘం నేతలపై ఆరోపణలు చేయడం వల్లే తమ పొలాలకు నీరివ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మాపైనే ఆరోపణలు చేస్తారా మీకు నీరెలా వస్తుందో చూస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. దాని వల్లే అధికారులు నీటిసరఫరాపై దృష్టి సారించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. -
అందని నీరు.. అన్నదాత కన్నీరు..
-ఏలేరు ఆయకట్టులో 500 ఎకరాల్లో ఎండిన రబీ పంట -వట్టిపోయిన పాలకులు, అధికారుల వాగ్దానాలు -ఎకరాకూ రూ.30 వేల వరకూ నష్టం -పశువులను మేపుకొంటున్న రైతులు పిఠాపురం : ‘ఏలేరు రైతుల కన్నీరు తుడుస్తాం. కోట్లు కుమ్మరిస్తున్నాం. ఒక్క ఎకరం కూడా ఎండనివ్వం. రబీకి పుష్కలంగా సాగునీరు అందిస్తున్నాం’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పాలకులు చివరికి ఆ ఆయకట్టు రైతులను నిలువునా ముంచేశారు. ప్రతి ఎకరాకూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు నీరందక కళ్ల ముందే ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు, పీబీసీ పరిధిలో సుమారు 14 వేల హెక్టార్లలో రబీ సాగు చేపట్టారు. ఏలేరు ఆయకట్టులో పిఠాపురం సమీపంలో ఉన్న సుమారు 500 ఎకరాల రబీ పంట గత 40 రోజులుగా (నాలుగు తడులు) సాగునీరందక ఎండిపోయింది. ఎకరానికి సుమారు రూ.24 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, కనీసం పచ్చగడ్డిగా కూడా పనికి రాకుండా పంటలు నాశనమయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటను కాపాడుకోవడానికి అనేక విధాలా ప్రయత్నించామని, నీటిపారుదల శాఖాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కన్నెత్తి చూడలేదని, ఇంజన్లతో నీరు తోడుకుందామన్నా కాలువలు మూసుకుపోయి చుక్కనీరు కూడా లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. చేలలో పశువులను మేపుకొంటున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. సాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ఏలేరు నీటిసంఘం నాయకులు అధికారపార్టీ నేతల వద్దకు వెళ్లి నిలదీసినా నోరుమెదపడం లేదని, కనీసం వచ్చి ఎండిన పంటలను చూసిన పాపాన పోలేదని నిరసిస్తున్నారు. ఎండిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాంగ్ పోస్టింగ్ పేరుతో రూ.14.65 లక్షల స్వాహా
► పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకులో ఘరానా మోసం ► బ్యాంకు మేనేజరు, సిబ్బంది సహకారంతోనే.. ► పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి, వైఎస్సార్ సీపీ నేత పాపారాయుడు రాజమహేంద్రవరం సిటీ: తన బ్యాంకు ఖాతా నుంచి రూ.14.65 లక్షల్ని వేరే ఖాతాలకు మళ్లించారని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఆర్తమూరుకు చెందిన వ్యాపారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆరోపించారు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజరు, సిబ్బంది సహకారంతో ముగ్గురు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపారాయుడు ఈ వివరాలు తెలిపారు. తనకు రామచంద్రపురం ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉందన్నారు. అదే బ్రాంచిలో గోల్డ్‌లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న గొలుగూరి శ్రీనివాసరెడ్డి.. జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన అబ్బిరెడ్డి నూకారెడ్డి, తమిలిశెట్టి గోపాలరెడ్డిలకు పిఠాపురంలో బంగారంపై తీసుకున్న రుణం తీర్చే నిమిత్తం గత ఏడాది సెప్టెంబర్ 12న తన వద్ద చెరో రూ.7 లక్షల వంతున మొత్తం రూ.14 లక్షలు అప్పుగా ఇప్పించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 22న తన బాకీ తీర్చేందుకు పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకులోని అబ్బిరెడ్డి ఖాతా (400801500063) నుంచి రూ.7,45,000, గోపాలరెడ్డి ఖాతా (400801500064) నుంచి రూ.7,20,000 రామచంద్రపురంలోని తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపారు. ఆ మరుసటి రోజు ఆర్తమూరు వచ్చి అప్పునకు సంబంధించి మిగిలిన వడ్డీ సొమ్ము చెల్లించి తన వద్ద నుంచి హామీపత్రాలు, ప్రామిసరీ నోట్లు తీసుకెళ్లారన్నారు. నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి ఖాతాల నుంచి తనఖాతాలో జమ అయిన రూ.14,65,000 లను రాంగ్ పోస్టింగ్ పేరుతో ఈనెల 4 న పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజరు, సిబ్బంది తనకు సమాచారం ఇవ్వకుండానే వారి ఖాతాలకు బదలాయించారని చెప్పారు.ఈ విషయమై శ్రీనివాసరెడ్డి, నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డిలను ఆరా తీయగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తన బ్యాంకు ఖాతా నుంచి సొమ్మును కాజేసిన శ్రీనివాసరెడ్డి, నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, పిఠాపురం బ్యాంకు మేనేజరు, సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ గండేపల్లి అరుణకుమార్‌ను వివరణ కోరగా మాట్లాడేందుకు నిరాకరించారు. -
అక్రమాల గుట్టు రట్టు
- పిఠాపురం పింఛన్ల బాగోతంపై కదిలిన అధికారులు - ‘సాక్షి’ వరుస కథనాలతో విచారణ - 40 శాతం అక్రమాలేనని ప్రాథమిక నిర్ధారణ - ఇద్దరు చిరుద్యోగులపై వేటు - అసలు సూత్రధారుల మాటేమిటో?! అర్హులైన లబ్ధిదారుల కళ్లల్లో కారం కొట్టి.. అక్రమార్కులకు పింఛన్లను దోచిపెట్టిన వ్యవహారం గుట్టు రట్టయ్యింది. ‘సాక్షి’ సాగించిన అక్షర సమరంతో.. దాచిపెడదామన్నా దాగని నిజాలు.. పుట్టలోని నాగుల్లా బయటకు వచ్చేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో.. అధికార పార్టీ ముఖ్య నేత అండతో.. ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున పింఛన్లను అనర్హులకు కట్టబెట్టిన వ్యవహారంపై అధికారులు కదిలారు. ఇద్దరు చిరుద్యోగులపై వేటు వేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : పిఠాపురం పింఛన్ల బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు కలకలం రేపాయి. ‘భర్తలు బతికున్నా.. వితంతు పింఛన్లు!’ శీర్షికన 9వ తేదీ ప్రధాన సంచికలోను, ‘అంతా వితంతే!’ శీర్షికన 10వ తేదీ జిల్లా మొదటి పేజీలోను ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం స్పందించింది. పింఛన్ల అక్రమాలపై చురుకుగా విచారణ చేపట్టింది. ‘సాక్షి’ ఏదైతే చెప్పిందో అదంతా నూరు శాతం వాస్తవమేనని ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చింది. ఈ అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి పిఠాపురం మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజేష్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సరెండర్ చేశారు. మరోపక్క కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీఆర్ఓలతో కూడా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు సస్పెండైన జూనియర్ అసిస్టెంట్ వేణుపై ప్రత్యేక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, మొత్తం పింఛన్ల బాగోతంపై లోతైన విచారణ జరపాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సీహెచ్.నాగనరసింహరావును మున్సిపల్ ఆర్డీ ఆదేశించారు. ‘మమ’ అనిపించేద్దామనుకున్నా.. తొలుత స్థానిక మున్సిపల్ అధికారులతో విచారణనుæ మమ అనిపించేద్దామనే ప్రయత్నం జరిగింది. దీనిపై ఈ నెల 11వ తేదీన ‘దొంగ చేతికే తాళాలు’ శీర్షికన ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆగమేఘాల మీద రెవెన్యూ యంత్రాంగంతో స్వతంత్ర విచారణకు శ్రీకారం చుట్టారు. విచారణాధికారిగా కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబును నియమించారు. ఆదివారం సెలవు దినమైనా ఆర్డీఓతోపాటు పిఠాపురం నియోజకవర్గ వీఆర్ఓలు, వీఆర్ఏలతో కలసి ఆయన మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత పింఛన్లకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం తదితర నియోజకవర్గాల నుంచి వీఆర్ఓలను రప్పించి పిఠాపురంలో ఆదివారం విచారణ చేపట్టారు. ఒక్క పిఠాపురం మున్సిపల్ పరిధిలో మంజూరు చేసిన 321 పింఛన్లలోనే సగానికి పైగా అక్రమార్కుల చేతుల్లోకి పోయాయని ప్రాథమికంగా నిర్ధారించారు. వయస్సు, కులం, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఏ పత్రాలూ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్టు నిగ్గు తేల్చారు. 321 పింఛన్లపైనా విచారణ చేపట్టగా, ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అక్షర సత్యమని తేల్చారు. ఆదివారం రాత్రికి 16 వార్డుల్లో విచారణ ప్రాథమికంగా పూర్తి చేశారు. అందులో 40 శాతం పైనే అక్రమాలు బయటపడ్డాయని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆన్లైన్లో మాత్రం అన్ని సర్టిఫికెట్లూ ఉన్నట్టు చూపించారు. వాస్తవంగా చూస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందినవారిని గీత కార్మికులుగా కూడా చూపించి పింఛన్లు కట్టబెట్టారు. గొర్రెల సత్యవతి, తిరువీధుల వీరలక్ష్మి, కొల్లు అమ్మాజీ.. ఈ ముగ్గురి భర్తలూ బంగారంలా బతికే ఉన్నారు. కానీ వితంతు పింఛన్లు పొందుతున్న విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో అక్రమాలన్నీ వాస్తవమనే తేల్చారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమమార్గంలో పింఛన్లు పొందుతున్న మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే యోచనలో ఉన్నారు. పింఛన్ల అక్రమాలపై 24 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలంటూ కలెక్టర్ ఆదేశించారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఎంతమాత్రం తమ తప్పు లేదని విచారణాధికారికి మున్సిపల్ ఉద్యోగులు విన్నవించినట్టు సమాచారం. తమను బెదిరించి తప్పు చేయించారే తప్ప తామేమీ కావాలని చేయలేదని వారు చెప్పుకున్నారు. బలవుతున్నది చిరుద్యోగులే.. ఈ మొత్తం వ్యవహారంలో చిరుద్యోగులే బలైపోతున్నారని, అసలైన సూత్రధారులకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతం వెలుగులోకి వచ్చి రోజులు గడిచేకొద్దీ ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఒక పింఛన్ మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రక్రియలు పూర్తి చేయాలి. అటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్న చిరుద్యోగులనే బాధ్యులను చేసి, బలిపశువులను చేయడం ఎంతవరకూ సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులకు అంత అడ్డగోలుగా పింఛన్లు మంజూరు చేసినప్పుడు, మున్సిపాలిటీలోని వివిధ సెక్షన్లలో ఉన్న అధికారులు నోరు మెదపకుండా మిన్నకుండి పోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులెవరో నిగ్గు తేల్చాలన్న డిమాండ్ వస్తోంది. ఇన్ని అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో మొత్తం పింఛన్లను రద్దు చేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైనవారికి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జన్మభూమి కమిటీలకు ఎటువంటి సంబంధమూ లేదని స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సర్టిఫికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అక్రమాలపై ఒకపక్క విచారణ జరుగుతున్న సమయంలో.. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతాలని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విచారణ నిష్పక్షపాతంగా జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. -
రూ.వెయ్యి కోసం ఇదేమి నీచం
పేదల పొట్టకొట్టి పింఛన్లు పంచుకుంటారా.. జన్మభూమి కమిటీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్ పిఠాపురంలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన, ధర్నా, ప్రదర్శన పిఠాపురం: ఆకలితో అలమటిస్తూ గుక్కెడు గంజి తాగడానికి ప్రభుత్వం ఇచ్చే పింఛ¯ŒS కోసం ఎదరు చూసే పేదల పొట్టగొట్టి రూ.1000 కోసం మిమ్మల్ని మీరే చంపేసుకుంటారా...? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని జన్మభూమి కమిటీలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. భర్తలు బతికి ఉండగా భార్యలను వితంతువులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆ పేర్లను సిఫార్సు చేసిన జన్మభూమి కమిటీలపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు లబ్ధిదారులతో కలిసి శుక్రవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతు తమకు పింఛ¯ŒS మంజూరు చేయాలని కోరుతూ వందల మంది ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తులు చేసుకుంటే వాటిని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఆయన ఆరోపించారు. ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే చాలు పింఛ¯ŒS మంజూరు చేసేశారని, అందుకే ఇన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. పెండెం దొరబాబు మాట్లాడుతూ పేరుకే ఆ¯ŒSలై¯ŒS అన్నారు గాని అందా తమ లైనులోనే పని చక్కబెట్టేసుకున్నారన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నాయకులు ధర్నా నిర్వహించి కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. కమిషనర్ కార్యాలయంలో లేకపోవడంతో ఆయన వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలని నాయకులు పట్టుబట్టగా మేనేజర్ మూర్తి నేతల వద్దకు వచ్చి ‘కమిషనర్ ఉన్నతాధికారుల మీటింగ్‌కు వెళ్లారని ప్రస్తుతం పింఛన్ల వ్యవహారంపై విచారణ జరుగుతోందని...సాయంత్రానికి నివేదికలు వస్తాయని వాటిని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని’ చెప్పారు. విచారణ ఎవరు జరుపుతున్నారని కన్నబాబు అడగ్గా మున్సిపల్ సిబ్బంది అని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ‘మీరే తప్పు చేసి మీరే విచారణ ఎలా చేస్తారంటూ’ నిలదీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, çజిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామ య్య, కౌన్సిలర్ పచ్చిమళ్ల జ్యోతి, నేతలు ఆనాల సుదర్శన్, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, మైనార్టీ నేత మొహీద్దీన్, వజ్రపు వీరేష్, నడిగట్ల చింతలరావు, కర్రి ప్రసాద్, మొగిలి అయ్యారావు, జవ్వాది బాబ్జి, అద్దంకి స్వామి, తదితర నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ఉప్పాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఉప్పాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాలు.. ఉప్పాడ గ్రామానికి చెందిన గీతాల సత్యనారాయణ(35) అనే వ్యక్తి నక్కా శ్రీను, నక్కా కాసులు అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర రూ. 45 వేలు అప్పు చేశాడు. ఎంతకీ బీకీ చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి సత్యనారాయణను తీసుకొచ్చి తమ ఇంట్లో నిర్భంధించారు. గురువారం ఉదయం చూసే సరికి నిర్జీవంగా పడి ఉన్నాడు. శ్రీను, కాసులు కలిసి సత్యనారాయణను చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. -
లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు
పిఠాపురం(తూర్పుగోదావరి జిల్లా): పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి కాళ్లపై నుంచి లారీ వెళ్లటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో కాకినాడ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉప్పాడ తీరంలో10 బోట్లు గల్లంతు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 10 బోట్లు గల్లంతయ్యాయి. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో కొన్నాడ గ్రామపంచాయితీకి చెందిన కొండెల గంగరాజుకు చెందిన బోటు గత బుధవారం 8 మందితో చేపల వేటకు వెళ్లింది. అయితే నాలుగు రోజుల అయిన తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులకు, మత్య్స శాఖ అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 10 బోట్లు చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు సమాచారం. వీటిలో ఉప్పాడ, రామన్నపాలెం, అమీనాబాద్ గ్రామాలకు చెందిన బోట్ల ఆచూకి లభించడంలేదు. ఈ 10 బోట్లలో దాదాపు 50 మంది మత్య్సకారులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారుల ఆచూకి కోసం చర్యలు చేపట్టారు. మత్య్సకారుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం: చినరాజప్ప
పిఠాపురం: రైతురుణాల మాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో గురువారం ఆయన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై చిత్తశుద్ధితో ఉన్నారని, మాఫీ విధివిధానాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేందుకే కోటయ్య కమిటీని నియమించారన్నారు. రైతులతో పాటు చేనేత, డ్వాక్రా సంఘాల రుణాలను సైతం మాఫీ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత సీజన్లో రైతులకు సకాలంలో బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చూస్తామన్నారు. మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు ఎంఆర్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించేలా ఆదేశించినట్టు చెప్పారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి అస్వస్థత
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబు అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తూ దొరబాబు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కాకినాడ సేఫ్ ఆస్పత్రికి తరలించారు. -
తల్లీ! ఎంత తల్లడిల్లి ఇంతకు తెగించావో!
పిఠాపురం, న్యూస్‌లైన్ : కాయకష్టం చేసినా భార్యాబిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తపన పడే ఆ ఇంటి యజమాని.. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయంలా నాలుగిళ్లలో పని చేస్తూ భర్తపై భారాన్ని తగ్గించాలని ఆరాటపడే భార్య.. వారి కలల పంటగా ముద్దుల మూటగట్టే ఇద్దరు పిల్లలు.. ఆ కుటుంబం ఆప్యాయతానురాగాలే తరగని సిరిగా ఉన్నంతలో ఆనందంగానే గడుపుతోంది. అతడికి ప్రమాదకరమైన వ్యాధి సోకింది. ఓవైపు చికిత్స చేయించే స్తోమతు లేక, అభిమానం చంపుకొని ఎవరినీ సాయం కోసం యాచించలేక, మరోవైపు భర్తకు ఏమైనా అయితే.. అతడు లేని లోకంలో తాను, బిడ్డలు అనాథలుగా మిగులుతామన్న ఊహనే భరించలేక.. ఇద్దరు బిడ్డలతో కలిసి లోకం నుంచే నిష్ర్కమించాలనుకుంది. ఆ ప్రయత్నంలో ఆమెను కడలి పొట్టన పెట్టుకోగా.. జాలరుల పుణ్యమాని పసి ప్రాణాలకు గండం తప్పింది. పిఠాపురం కత్తులగూడెంకు చెందిన ఈపు సూర్యావతి (28) శుక్రవారం ఉదయం 11.30 సమయంలో తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఉప్పాడ వద్ద జియోట్యూబ్ రక్షణగోడ నుంచి సముద్రంలోకి దూకింది. ఆమె కెరటాల్లో చిక్కుకుని మరణించగా.. పిల్లలిద్దరినీ జాలరులు కాపాడారు. పోలీసులు, సూర్యావతి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి కత్తులగూడెంకు చెందిన సూర్యావతికి జగ్గంపేట మండలం గొర్లగుంటకు చెందిన శ్రీనుతో 2006లో పెళ్లైంది. వారికి నాలుగేళ్ల అప్పన్న (అనిల్), మూడేళ్ల దేవి అనే పిల్లలున్నారు. ఈ కుటుంబం కత్తులగూడెంలోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. శ్రీను కూలిపనులుకు వెళుతుండగా సూర్యావతి కొన్ని ఇళ్లలో పనిమనిషిగా కుదిరి భర్తకు ఊతంగా నిలుస్తోంది. ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్న ఆ దంపతులు అనిల్‌ను ఓ కాన్వెంట్లో చేర్చి, దేవిని అంగన్వాడీ బడికి పంపుతున్నారు. శ్రీను ఇటీవల అస్వస్థతకు గురై వైద్యులకు చూపించుకుంటే మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతగా నిర్ధారణైంది. చికిత్సకు లక్షలు ఖర్చవుతాయనడంతో ఆ దంపతులకు దిక్కుతోచ లేదు. ఈ నేపథ్యంలో సూర్యావతి తన ఇద్దరు బిడ్డలనూ తీసుకుని పిఠాపురం నుంచి ఉప్పాడ బీచ్ రోడ్ సెంటర్‌కు చేరుకుని, అక్కడి శివాలయం సమీపంలో జియోట్యూబ్ రక్షణ గోడ నుంచి సముద్రంలోకి దూకేసింది. ఆ పాటుకు ఆమె చేతి పట్టు నుంచి జారిపోయిన పసివాళ్లు బండరాళ్లను పట్టుకుని గోలుగోలున విలపించారు. వారిని గమనించిన సమీపంలోని ముగ్గురు జాలరులు సముద్రంలోకి దూకి పిల్లలిద్దరినీ కాపాడారు. పిల్లలు తల్లి కూడా మునిగిపోతోందని చెప్పడంతో తిరిగి వెళ్లి గాలించగా అప్పటికే మరణించిన సూర్యావతి కనిపించింది. ఈ సంఘటనతో పిఠాపురం కత్తులగూడెంలో విషాదం అలముకుంది. అమ్మ అప్పచ్చిలు కొనిపెడతానంది.. ‘అమ్మ నన్ను పొద్దున్నే స్కూలుకు పంపింది. తర్వాత చెల్లిని తీసుకు వచ్చి నాకు టిఫిన్ తినిపించాలని మాస్టారుతో చెప్పింది. ఇద్దరికీ అప్పచ్చిలు కొనిపెడతానంది. చెల్లిని ఎత్తుకుని, నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కొండెవరం వరకు తీసుకెళ్లాక అక్కడ ఆటోఎక్కించింది. ఆటో దిగాక సముద్రం దగ్గరకు తీసుకెళ్లి ఇద్దరినీ పట్టుకుని నీళ్లలోకి దూకేసింది. నేను ఉప్పునీరు తాగేశాను. చెల్లి ఏడుస్తోంది. ఇంతలో ముగ్గురు వచ్చి మమ్మల్ని బయటకు తెచ్చారు. ‘అమ్మ మునిగిపోతోంది’ అంటూ మేము ఏడవడంతో వాళ్లే వెళ్లి అమ్మను వాళ్లు తీసుకొచ్చారు’.. కన్నతల్లి కడలి పాలైన వైనం గురించి బరువెక్కిన లేతగుండెతో నాలుగేళ్ల అనిల్ తనకు చేతనైన రీతిలో చెప్పిన వివరాల సారాంశం ఇది. మూడేళ్ల దేవికి బంధువులు అన్నం తినిపించబోగా ‘అమ్మ తినిపిస్తేనే తింటాను’ అని మారాం చేయడం అందరి హృదయాలనూ కలచివేిసింది. ఆమె ప్రేమతోనే రోజులు నెట్టుకొస్తున్నా.. ఉదయమే వేరే ఊళ్లో కూలిపనికి వెళ్లి విషయం తెలిసి వచ్చిన శ్రీను విగతజీవి అయిన భార్యను చూసి బావురుమన్నాడు. అనారోగ్యంతో ఉన్న తనను కంటిని రెప్పలా కాచుకుందని, ఇలా తనను వదిలి వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదని రోదిస్తుంటే ఓదార్చడం కష్టతరమైంది. ఒక్కగానొక్క కూతురు తమ కళ్లెదుటే ఉంటే అండగా ఉండొచ్చని పిఠాపురంలో కాపురం పెట్టించామని, తనువు చాలించిందని సూర్యావతి తల్లిదండ్రులు గింజాల నాగమణి, రాంబాబు విలపించారు. సూర్యావతి గత రాత్రి నుంచి దిగులుగా ఉందని, ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిందని ఇంతటి కఠోర నిర్ణయం తీసుకుందని ఊహించలేకపోయామని ఇరుగుపొరుగువారు కంటతడి పెడుతున్నారు. స్నానం చేయడానికి వచ్చారనుకున్నాం.. రోజూ చాలామంది సముద్రంలో స్నానం చేయడానికి వస్తారు. బిడ్డలను తీసుకుని మా ముందు నుంచే వెళ్లిన ఈమె కూడా అలాగే స్నానానికి వచ్చిందనుకున్నాం. కాసేపటికి దూరంగా పిల్లలు మునిగిపోతూ కనిపించారు. పరుగున వెళ్లి పిల్లలను ఒడ్డుకు తెచ్చాం. వాళ్లు అమ్మ మునిగిపోతోందని చెప్పడంతో మళ్లీ వెళ్లి ఆమెను ఒడ్డుకు తెచ్చేసరికే చనిపోయింది’ అంటూ పిల్లలను కాపాడిన శ్రీను, రాజన్న, లక్ష్మణ్ అనే జాలరులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తడిసి ముద్దయి, వణికిపోతున్న పిల్లలకు పొడిబట్టలు వేసి ఆస్పత్రికి తీసుకు వెళ్లామని చెప్పారు. కాగా అనిల్ తాను చదివే స్కూలు పేరు చెప్పడంతో వివరాలు తెలిశాయని పోలీసులు తెలిపారు. -
ఎక్సైజ్ స్టేషన్ ముట్టడి
పిఠాపురం రూరల్, న్యూస్‌లైన్ : ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహా రం వివాదాస్పదంగా మారింది. ఆమెను అన్యాయంగా అరెస్టు చేసి, నిర్బంధించారం టూ ఆరోపిస్తూ ఆందోళనకారులు స్థానిక జగ్గయ్యచెరువులో ఉన్న ఎక్సైజ్ స్టేషన్‌ను ముట్టడించారు. అయితే ఎక్సైజ్ పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చారు. వివరాలిలా ఉన్నాయి. పి.దొంతమూరులో సారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో గొల్లప్రోలుకు చెందిన మద్యం వ్యాపారులతో కలిసి ఎక్సైజ్ అధికారులు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో కోశెట్టి సీతమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆమెపై అక్రమ కేసు బనాయించారని, సారాతో ఆమెకు సంబంధం లేదని చెప్పారు. మహిళను అదుపులోకి తీసుకునేటప్పుడు మహిళా పోలీసు ఉండాలనే కనీస నిబంధనను పాటించలేదని ఆరోపించారు. మహిళా పోలీసు లేకుండా రాత్రంతా ఆమెను ఎక్సైజ్ స్టేషన్లో ఉంచారన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, ఎక్సైజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఇలాఉండగా పది లీటర్ల సారాతో పట్టుబడ్డ సీతమ్మను ప్రత్తిపాడు సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్టు ఎక్సైజ్ సీఐ రమణ తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ లేరని, అందుబాటులో ఉన్న మహిళా వాచ్‌మన్ సమక్షంలో సీతమ్మను ఉంచినట్టు చెప్పారు. నిర్భయ కేసు నమోదు ఇలాఉండగా తన భార్యను అన్యాయంగా సారా కేసులో అరెస్టు చేసి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సీతమ్మ భర్త గౌరేష్ పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితులు ఎక్సైజ్ సీఐ రమణ, టాస్స్ఫోర్స ఎస్సై అశోక్, గొల్లప్రోలుకు చెందిన బస్సా రాజా, గాదం శ్రీనులపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్టు శుక్రవారం రాత్రి రూరల్ ఎస్సై శివగణేష్ తెలిపారు.