పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 10 బోట్లు గల్లంతయ్యాయి. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో కొన్నాడ గ్రామపంచాయితీకి చెందిన కొండెల గంగరాజుకు చెందిన బోటు గత బుధవారం 8 మందితో చేపల వేటకు వెళ్లింది. అయితే నాలుగు రోజుల అయిన తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులకు, మత్య్స శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అంతేకాకుండా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 10 బోట్లు చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు సమాచారం. వీటిలో ఉప్పాడ, రామన్నపాలెం, అమీనాబాద్ గ్రామాలకు చెందిన బోట్ల ఆచూకి లభించడంలేదు. ఈ 10 బోట్లలో దాదాపు 50 మంది మత్య్సకారులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారుల ఆచూకి కోసం చర్యలు చేపట్టారు. మత్య్సకారుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.