
నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే సామెత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదీ మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి గురించి ముందు నెగిటివ్‌గా మాట్లాడి వెంటనే పాజిటివ్‌గా పొడుగుతూ ఆయన్నే దగ్గరకు తీసుకుంటారు పవన్. అంతేకాదు పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేస్తారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు(2014) పిఠాపురం నుంచి ఎన్వీఎస్‌ఎన్ వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పవన్.. వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఇక్కడ పేకాట క్లబ్ నడుపుతున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి పేకాట నడుపుతారా? అని ప్రశ్నించి వర్మపై చిందులు వేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు.
ఇక, కట్ చేస్తే ఇప్పుడు అదే వర్మను కలిసి పవన్ సాదర ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం వర్మను వీరుడు అని అంటున్నాడు. దీంతో, సోషల్ మీడియాలో పవన్‌పై ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా.. ఒకవేళ పవన్ గెలిస్తే మీ పార్ట్‌నర్ పేకాట క్లబ్ మూస్తారా? లేక మీరే పార్ట్‌నర్ అవుతారా? అని నెటిజన్లు ప్రశిస్తున్నారు. ఇదే సమయంలో పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.