
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన స్థానిక జనసేన నేత ఒకరు శుక్రవారం వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా వర్మ ఆయనతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ స్నేహితులేని, ఎన్నికల తరువాత వారిద్దరూ కలిసే ఉంటారని అన్నారు. ఇంకా కొంతమంది ఉంటే టీడీపీలో చేర్పించాలని.. జనసేన కూడా మనతో కలిసే పార్టీయేనని చెప్పారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య బంధం ఇంకా కొనసాగుతూనే ఉందని విశాఖ టీడీపీ ఎన్నికల పరిశీలకు మెట్ట సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య మంచి అవగహన ఉందని.. దాని ప్రకారమే సీట్ల ఒప్పందం కూడా జరిగిందని ఆయన తెలిపారు. టీడీపీకి చెందిన కీలక నేత పవన్, బాబు మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేయడంతో ఇన్నేళ్లు జరుగుతున్న ప్రచారం నిజమైంది. కాగా టీడీపీ, జనసే మధ్య ఉన్న అతర్గత ఒప్పందం ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సీట్ల పంపిణీ విషయంలో కూడా ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందం. ఒక్కో ఘటన బయటపడుతుండడంతో నిజమైన జనసేన శ్రేణులు నివ్వెరపోతున్నాయి. కాగా నిజంగానే బాబుతో విభేదించి బయటకు వచ్చారని, నిజమైన ప్రత్యామ్నాయం కోసం పవన్ కల్యాణ్ తపనపడుతున్నాడని నమ్మిన ఆయన అనుచరులు కంగుతింటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment