సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ, జనసేన ముసుగు రాజకీయాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇప్పటికీ కలిసే ఉన్నారని టీడీపీ ఇటీవల బయటపడుతున్న పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వేదికలపై అంటీఅంటకుండా విమర్శలు చేసుకుంటున్న ఇరు పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఇక పవన్, బాబు మధ్య ఉన్న దోస్తానా గురించి పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ బయటపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ మన స్నేహితుడే.. అంతా కలిసే పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఇక విశాఖజిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, పార్టీ కీలక నేత మెట్ల రమణబాబు కూడా టీడీపీ, జనసేన బంధాన్ని బయటపెట్టారు.
పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గండి రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో రమణబాబు మట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసే ఉన్నారు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా ఏమీ లేరు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉన్నారు’ అన్నారు. ఇంకా కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం. ఒక అవగాహనతో ఉన్నారని బయటపెట్టారు.
(చదవండి : ఎస్పీవై నామినేషన్ : టీడీపీ, జనసేన హైడ్రామా..!)
(చదవండి : నామినేషన్ ఉపసంహరించుకున్న జనసేన అభ్యర్థి)
Comments
Please login to add a commentAdd a comment