AP: కన్ఫ్యూజన్‌లో పవన్‌.. ‘వర్మ’పైనే భారం ! | Pawan Kalyan In Confusion Over Facing Of Andhra Pradesh Elections 2024 - Sakshi
Sakshi News home page

కన్ఫ్యూజన్‌లో జనసేనాని.. ‘వర్మ’పైనే భారం !

Published Fri, Apr 5 2024 8:09 PM | Last Updated on Fri, Apr 5 2024 8:31 PM

Pavan Kalyan In Confusion Over Facing Of Elections In Andhra - Sakshi

సాక్షి, కాకినాడ: జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతలతో తిట్లు తిన్న పవన్ కల్యాణ్‌కు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టీడీపీ నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించడం పై ట్రోలింగ్ జరుగుతోంది.

పవన్‌ ఏం చేస్తున్నారు..?

పవన్‌ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలా ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్ధులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనూ  ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం  ఒక వైపే చూస్తున్నారు. రెండో వైపు చూడ్డానికి భయపడుతున్నారు.

కాపుల ఓట్లే కారణమా..

పిఠాపురం సీటును ఆయన ఎంచుకోడానికి కారణం  ఆ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో  కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడమే. కులాలు లేవు మతాలు లేవు..నేను విశ్వమానవున్ని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తమ కులం ఓట్లకోసమే పిఠాపురం ఎంచుకున్నారని టీడీపీ సీనియర్లే అంటున్నారు. పిఠాపురంలో   పవన్ కల్యాణ్‌కు  ఏదీ కలిసి రావడం లేదు. ఎవరూ  కదలి రావడం లేదు. పిఠాపురం లో టీడీపీ రెబల్‌  వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన అయిష్టంగా పవన్ కు మద్దతుగా ఉంటానని అన్నారు. అయితే మాటలు చెప్పినంత జోరుగా వర్మ ప్రచారంలో పాల్గొనడం లేదు.

దూసుకుపోతున్న వంగా గీత..

పిఠాపురం నియోజకవర్గంలో  పాలకపక్ష అభ్యర్ధి  వంగాగీత దూసుకుపోతున్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లోనూ మంచి పేరు ఉండడమే కాకుండా అన్ని వర్గాలూ ఆమెకు అండగా ఉన్నాయి. వాటిని మించి ప్రభుత్వం అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు..అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాయి. అవే తనని గెలిపిస్తాయని గీత ధీమాగా ఉన్నారు.

ఓటమిని ఒప్పుకున్నట్లే..  

పిఠాపురం గెలుపు భారం వర్మపై వేసిన పవన్ ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి.. ఆ పార్టీ తరపున మిగతా అభ్యర్ధుల నియోజక వర్గాలు పట్టించుకోకుండా కేవలం తన సొంత నియోజక వర్గానికే పరిమితం అయిన పవన్ కల్యాణ్ కనీసం తనని తాను గెలిపించుకునే పరిస్థితిలో లేనందునే వర్మలాంటి ఊత కర్రలకోసం వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి.. గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement