బ్రాయిలర్ కోడికి ఆయొచ్చింది..
పిఠాపురం ప్రచారానికి సెలవు...
జర్రమొచ్చిందే మామా జర్రమొచ్చిందే
ఎండాకాలం... ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాయి. సుకుమారంగా సున్నితంగా పెరిగే జీవులకు ఇవి గడ్డు రోజులు. కోళ్లఫారాలు...హైబ్రిడ్ ఆవులు.. గేదెలు పెంచేవాళ్ళు తమ జీవాలను కాపాడుకునేందుకు వాటికి ఏసీలు పెడుతుంటారు. తరచూ చల్లని నీళ్లు చల్లుతూ వాటిని కూల్ చేస్తుంటారు.. లేదంటే అవి ఎండవేడికి తట్టుకోలేక గుడ్లు తేలేస్తాయి..నిత్యం ప్రజల్లోనే ఉంటాను.. ప్రజలతోనే ఉంటాను.. ప్రజలకోసం ఉంటాను.. సీఎం వైఎస్ జగన్కు యుద్ధాన్ని చూపిస్తాను అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను ముగించారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. మచ్చుకు ఒక రోజు అలా పిఠాపురం వెళ్లి టీడీపీ వర్మను.. ఇంకొందరు పెద్దలను కలిసి ప్రచారం చేసారు. ప్లీజ్.. ప్లీజ్.. నన్ను గెలిపించండి అని అర్థించారు. తాను గెలిస్తే అక్కడ ప్రైవేటుగా నిధులు సేకరించి ఆస్పత్రి నిర్మిస్తాను అని చెప్పి... కాస్త హడావుడి చేసారు. అంతే.. మళ్ళీ సాయంత్రం చూస్తే పవన్ లేరు. జంప్.. ఏమైంది అని ఆరా తీస్తే జర్రమొచ్చింది అనే సమాచారం తెలిసింది.
మండుటెండల్లో రెండ్రోజులు జనాల్లో తిరిగేసరికి ఆయనకు ఆరోగ్యం చెడింది. సాయంత్రానికి జర్రమొచ్చింది... జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.. దానికితోడు ఆయన మీద అభిమానులు పూలు చల్లడంతో అది కూడా ఎలర్జీకి దారితీసిందని తెలిసింది.. దీంతో ఇక ప్రచారం రద్దు చేసి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి షో చేసి.. ఫోటోలు దిగి... ప్రభుత్వాన్ని.. రాజకీయ వైరి పక్షాలను నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. ఎండావానలను లెక్కచేయకుండా ప్రజల్లో ఉండాలని... అప్పుడే వారి అభిమానం చూరగొంటామని ప్రజలు సైతం అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ అంటే సినిమాల్లో పెద్ద స్టార్.. అడుగుతీసి అడుగువేస్తే పూలు పరుస్తారు... గొడుగుపడతారు.. మేకప్ చెదిరిపోకుండా క్షణానికోసారి టచప్ చేస్తారు. గంటకోసారి ఏసీలో కూర్చోవచ్చు.. కానీ రాజకీయాల్లో అదేం ఉండదు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... వాగులు వంకలు... గుట్టలు కొండలు అన్నీ దాటాలి. ప్రతి గుండెనూ తడమాలి... ప్రతిపేదవాన్నీ తనవాడు అనుకోవాలి... అన్ని చేస్తేతప్ప ప్రజల్లో నిలవలేరు. జస్ట్ అలా వచ్చి నోటికొచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోతే రాజకీయం కాదు అనే విషయం పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదు.
ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది... దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో... సేనాని దమ్ము ఇంతేనా... ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం... స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా... క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా ? పిఠాపురం ఒక్కదానికే అయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని... బ్రాయిలర్ కోడి మళ్ళీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment