రూ.వెయ్యి కోసం ఇదేమి నీచం
-
పేదల పొట్టకొట్టి పింఛన్లు పంచుకుంటారా..
-
జన్మభూమి కమిటీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్
-
పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన, ధర్నా, ప్రదర్శన
పిఠాపురం:
ఆకలితో అలమటిస్తూ గుక్కెడు గంజి తాగడానికి ప్రభుత్వం ఇచ్చే పింఛ¯ŒS కోసం ఎదరు చూసే పేదల పొట్టగొట్టి రూ.1000 కోసం మిమ్మల్ని మీరే చంపేసుకుంటారా...? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని జన్మభూమి కమిటీలపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.
భర్తలు బతికి ఉండగా భార్యలను వితంతువులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆ పేర్లను సిఫార్సు చేసిన జన్మభూమి కమిటీలపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు లబ్ధిదారులతో కలిసి శుక్రవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతు తమకు పింఛ¯ŒS మంజూరు చేయాలని కోరుతూ వందల మంది ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తులు చేసుకుంటే వాటిని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఆయన ఆరోపించారు. ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే చాలు పింఛ¯ŒS మంజూరు చేసేశారని, అందుకే ఇన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. పెండెం దొరబాబు మాట్లాడుతూ పేరుకే ఆ¯ŒSలై¯ŒS అన్నారు గాని అందా తమ లైనులోనే పని చక్కబెట్టేసుకున్నారన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నాయకులు ధర్నా నిర్వహించి కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. కమిషనర్ కార్యాలయంలో లేకపోవడంతో ఆయన వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలని నాయకులు పట్టుబట్టగా మేనేజర్ మూర్తి నేతల వద్దకు వచ్చి ‘కమిషనర్ ఉన్నతాధికారుల మీటింగ్‌కు వెళ్లారని ప్రస్తుతం పింఛన్ల వ్యవహారంపై విచారణ జరుగుతోందని...సాయంత్రానికి నివేదికలు వస్తాయని వాటిని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని’ చెప్పారు. విచారణ ఎవరు జరుపుతున్నారని కన్నబాబు అడగ్గా మున్సిపల్ సిబ్బంది అని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ‘మీరే తప్పు చేసి మీరే విచారణ ఎలా చేస్తారంటూ’ నిలదీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, çజిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామ య్య, కౌన్సిలర్ పచ్చిమళ్ల జ్యోతి, నేతలు ఆనాల సుదర్శన్, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, మైనార్టీ నేత మొహీద్దీన్, వజ్రపు వీరేష్, నడిగట్ల చింతలరావు, కర్రి ప్రసాద్, మొగిలి అయ్యారావు, జవ్వాది బాబ్జి, అద్దంకి స్వామి, తదితర నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.