విజయనగరం : పింఛన్ల పంపిణీ నిలిపివేసినందుకు నిరసనగా మంగళవారం ఉదయం పార్వతీపురం మున్సిపల్ కార్యలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా చేశారు. వివరాల్లోకెళితే పార్వతీపురం పట్టణంలో బయోమెట్రిక్ పనిచేయడం లేదంటూ దాదాపు 1000 మందికి పోస్టాఫీసుల్లో పింఛన్ల నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బాధితులకు మద్ధతుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(పార్వతీపురం)