వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గొల్లప్రోలు మండల శివారు నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గొల్లప్రోలు నుంచి చెందుర్తి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.