219వ రోజు పాదయాత్ర షెడ్యూల్ | Praja Sankalpa Yatra Day 219 Schedule | Sakshi
Sakshi News home page

219వ రోజు పాదయాత్ర షెడ్యూల్

Published Mon, Jul 23 2018 7:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 219వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సోమవారం ఉదయం సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్‌ క్యాంప్‌ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. సామర్లకోట మాతం సెంటర్‌, అయోధ్యా రామాపురం, చలపతి నగర్‌ మీదుగా గణపతి నగర్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement