అలుపెరుగని మోముతో ప్రజల సమస్యలు తెలసుకుంటూ, వారికి భరోసా ఇవ్వడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. తమ కోసం.. తమ ప్రాంతానికి వచ్చిన రాజన్న బిడ్డకు స్థానిక ప్రజలు పూలతో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. సోమవారం పలుసార్లు వర్షం అంతరాయం కలిగించినా మొక్కవోని దీక్షతో జననేత ముందుకు కదిలారు.