రాష్ట్రాంలో తాగు నీరులేని గ్రామాలు ఉన్నాయి తప్ప మద్యం షాపులు లేని గ్రామం ఒక్కటికి కూడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు . ఆయన చెపట్టిన ప్రజా సంకల్పం యాత్ర 229వ రోజు పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, పత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో నిర్వహించిన భాదీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీ ఇస్తే అవీ చాలనట్టు వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని మండిపడ్డారు.