pathipadu
-
కుల మత రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ
-
టీడీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి రావెల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. -
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అవినీతి మయంగా మార్చారు
-
ప్రైవేటు స్కూల్స్, కాలేజీల ఫీజులకు కళ్లెం: వైఎస్ జగన్
సాక్షి, తూర్పు గోదావరి/పత్తిపాడు : రాష్ట్రాంలో తాగు నీరులేని గ్రామాలు ఉన్నాయి తప్ప మద్యం షాపులు లేని గ్రామం ఒక్కటి కూడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలు అధిక ఫీజులతో పేదవాడిని దోచుకుంటున్నాయని, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదవాలంటే భూములు, బంగారం, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల అధిక ఫీజులకు కళ్లెం వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి ఇస్తే.. అవి చాలవనట్టు వైఎస్సార్సీపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు. 17 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్ పార్కు, విశాఖ-చెన్నై ఇండ్రస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, నాలుగేళ్ల పాలనలో వాటికి ఇంతవరకు పునాది కూడా పడలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ‘రాష్ట్రానికి ప్రాణవాయువులాంటి పోలవరం ప్రాజెక్టును అవినీతిమయంగా మార్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం కనీసం పునాదులు కూడా పూర్తికాని పరిస్థితి. కాంట్రాక్టుల ద్వారా లంచాలను దండుకోవాడానికి పొలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతున్నారు. రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఆయన ద్వారానే లంచాలు మంత్రులు, చినబాబు వద్దకు చేరుతున్నాయి’ అని వైఎస్ జగన్ అన్నారు. ‘ఇదే నియోజకవర్గంలో ఉన్న అన్నవరం సత్యనారాయణ ఆలయంలో శుభ్రం చేసే కాంట్రాక్టరు స్వయంగా చంద్రబాబు సమీప బంధువు. గతంలో ఆ కాంట్రాక్టు కేవలం ఏడు లక్షలు. దానిని చంద్రబాబు సీఎం అయ్యాక తన వాటాకోసం 32 లక్షలకు పెంచారు. లంచాల విషయంలో దేవుడిని కూడా వదిలిపెట్టడంలేదు. దేవుడిని కూడా దోచుకుంటున్నారు. నీరు చెట్టు పథకంలో ఇసుక, మట్టిని తోడేసి లంచాలు దన్నుకుంటూ భూ బకాసురులుగా మారారు. వైఎస్ఆర్ హయంలో పేదలకు పదిలక్షల ఇళ్లు కట్టించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన కనీసం ఊరికి నాలుగు ఇళ్లు కూడా కట్టించలేదు. ఎన్నికల సమయంలో జిల్లాలో జూనియర్ కాలేజీ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పునాది కూడా పడలేదు. 30 పడకుల కమ్యూనిటీ ఆసుపత్రిలో డాక్టర్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని మూసి వేసి, ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి పోయేల ప్రభుత్వం కుట్ర చేస్తొంది. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోవట్లేదు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏలాంటి రుణాలు అందడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. పంటలకు మద్దతు ధరలేక రోడ్లమీద పారపోస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. బాబు వచ్చాడు, నిరుద్యోగులకు జాబు మాత్రం రాలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నాలుగేళ్లయిన కూడా ఆ ఊసే లేదు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి అరెస్టు, విడుదల
ప్రత్తిపాడు, న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో ్ల ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావెల కిషోర్‌బాబును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఒకటవ తేదీన ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని తూర్పుపాలెం చర్చి ఆవరణలో ప్రచారం చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. దీంతో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.రామమూర్తి ఆదేశాల మేరకు 2వ తేదీన వీఆర్వో స్థానిక పోలిస్ స్టేషనులో పిర్యాదు చేయగా అదేరోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆది వారం రావెల కిషోర్‌బాబును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేసినట్లు ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
మరణంలోనూ వీడని బంధం...
మరణంలోనూ వీడని బంధం... పత్తిపాడు, కష్టసుఖాల్లో తోడునీడగా నిలిచిన ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టిందేమో... ట్రాక్టర్‌రూపంలో మృత్యువు కబళించింది. నాతిచరామి అంటూ అగ్నిసాక్షిగా వివాహమాడిన ఆ ఇద్దరూ జంట గానే మృత్యువాత పడ్డారు. కన్నబిడ్డలు మాత్రం అనాథలుగా మారారు. హృదయవిదారకమైన ఈ సంఘటన ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన నిజాంపట్నం శంకర్(27) తాపీపని పనిచేస్తుండగా, భార్య మాధవి(20) కూడా తనతో పాటు కూలి పనులు చేసుకుంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పనికి వెళ్లి, తిరిగి ద్విచక్రవాహనంపై రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో గొట్టిపాడు మీదుగా కొప్పర్రు వైపు వెళుతున్నారు. అదే సమయంలో గొట్టిపాడు సమీప పొలాల నుంచి పత్తి టిక్కీల లోడుతో గొట్టిపాడు వైపు ట్రాక్టర్ వస్తోంది. ఎదురెదురుగా వస్తూ ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ప్రతాప్కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.