పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు.
హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు.
ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు.
అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట..
ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు.
ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment