బాలేదు.. ఇదేం బాలేదు.. మరీ నేను లొంగిపోయినట్లు ఉంటే దొరికిపోయేలా ఉన్నాను.. మా సైనికులు సైతం నా ఈక్నెస్ పోల్చేసారంటే పార్టీ సైతం ఈకైపోద్ది. అందుకే కాసేపు కోపం తెచ్చుకుందాం అని డిసైడైపోయిన పవన్ కళ్యాణ్ అద్దం ముందు ఆగ్రహాన్ని ప్రాక్టీస్ చేసి మీడియా ముందుకు వచ్చారు.
కోపం ఆవాహయామి.. ఆవాహయామి.. ఆవాహయామి అని మూడుసార్లు గట్టిగా అనుకుని తెలుగుదేశం మీద లేని ఆగ్రహాన్ని చూపించారు. ఇలాగైతే కుదరదు.. నేను ఊరుకున్నంతవరకే సైలెంట్.. లేచానో మహా వైలెంట్ అంటూ గాల్లో కత్తి తిప్పారు. ఎగిరెగిరి తంతాను అన్నట్లుగా బయల్దేరి చివరాఖరుకు నాకు టీడీపీ తప్ప వేరే గతిలేదని తేల్చేశారు..
చంద్రబాబే సీఎం అంటూ మొన్న లోకేష్ సైతం తేల్చి చెప్పేసినా నేను ఏమీ అనలేదు.. నేను తలచుకుంటే ఇప్పుడే రెండు సీట్లు ప్రకటిస్తాను అంటూ తాము గతంలో గెలిచిన రాజోలు సీటుకు అభ్యర్థి పేరును ప్రకటించారు. ఇంత దీర్ఘం తీసి మనోడు ప్రకటించింది వాళ్ళ సొంత సీటే.. ఓస్ ఇదేనా అన్నట్లుగా ఉంది. అదేదో టీడీపీ బలంగా కోరుతున్న సీటును జనసేనకు ప్రకటిస్తే మనవాడు వీరత్వం తెలిసేది అని సైనికులు అంటున్నారు. ఇంకా పనిలో పనిగా మూడోవంతు సీట్లు కావాలని అన్నారు.. మంచిదే.. బలమైన డైలాగ్ వాడారు కానీ చివరివరకూ అదే పట్టుమీద ఉంటారా చివర్లో మళ్ళా జారిపోతారా? అదో సందేహం..
పద్మవిభూషణ్ ఎర.. టీడీపీ-సేన పొత్తుకు తెర..!
ఇదిలా ఉండగా పవన్‌ను తెలుగుదేశం వైపు పోనివ్వకుండా తమతోనే కలిసి ఎన్నికలకు వెళ్లేలా బీజేపీ కూడా పెద్ద ఎత్తులే వేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా కొణిదెల కుటుంబాన్ని ఇంకో లెవెల్‌కు తీసుకువెళ్లేందుకు బీజేపీ మార్గం వేసింది.. ఇప్పటికే పద్మ భూషణ్ అందుకున్న చిరంజీవికి ఇది మరో మెట్టు అన్నమాట. తద్వారా అయినా పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా కాషాయపార్టీ పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు.
అలా చేయడం ద్వారా పవన్ మళ్లీ టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీతోనే ఉండేలా కాషాయ పార్టీ అగ్రనాయకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇన్ని చేసినా తెలుగుదేశం వేసే ఎంగిలి మెతుకులు కేతకడానికి అలవాటుపడిపోయిన పవన్ బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటాడా?. మళ్లీ తోక ఊపుకుంటూ టీడీపీ వైపు వెళ్తారా? అనేది ఇప్పటికైతే తెలీడం లేదు.
ఇదిలా ఉండగా పవన్‌కు తాను ఇప్పుడు ప్రకటించుకున్న రాజానగరం, రాజోలు.. ఈ రెండు సీట్లే ఇచ్చి.. నువ్వే ప్రకటించుకోవయ్యా అని చంద్రబాబు చెప్పారని.. ఆఖరుకు ఆయనకు ఆ రెండే దక్కుతాయని అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగులు మొదలయ్యాయి.
- సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment