టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన స్థానిక జనసేన నేత ఒకరు శుక్రవారం వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు.