పిఠాపురం(తూర్పుగోదావరి జిల్లా): పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి కాళ్లపై నుంచి లారీ వెళ్లటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో కాకినాడ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.