ivrs survey
-
Yalamanchili: సుందరానికి షాక్
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్‌మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్ఎస్ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. విజయ్‌కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్‌కుమార్ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్(సుందరపు విజయ్‌కుమార్ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.ఆమెను అక్కా అని పిలిచే సతీష్ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్ వెహికల్ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్‌కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్ ఇవ్వని సతీష్ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.కొద్ది రోజులకు విజయ్‌కుమార్.. కొద్ది రోజులకు విజయ్‌కుమార్.. శ్రీదేవిని కలిసి రిలయన్స్ టెలీకాంలో 4జీ కేబుల్ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్‌కుమార్ ఆమెను రిలయన్స్ ఆఫీస్‌కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్‌పై లోన్ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్‌కుమార్‌కు ఇచ్చారు.విజయ్‌కుమార్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్ ఆఫీస్‌కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్ విజయ్‌కుమార్ అకౌంట్‌కు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్‌కుమార్‌ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్‌కుమార్ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.మత్స్యకార నేతపై హత్యాయత్నంయలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్‌పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. అయితే సుందరపు విజయ్‌కుమార్ మాత్రం కిరణ్‌పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్ జనసేన రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సుందరపు విజయ్‌కుమార్‌కు జనసేన టికెట్ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఐవీఆర్ఎస్ ఆంతర్యమేమి?
సాక్షి, విశాఖపట్నం : జనసేనలో రోజుకో గందరగోళానికి తెర లేస్తోంది. సీట్ల ప్రకటన నుంచి ఆరంభమైన ఈ అయోమయం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు కేటాయించారు. వీటిలో పెందుర్తి, విశాఖ దక్షిణ, అనకాపల్లి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో విశాఖ దక్షిణ మినహా మిగిలిన మూడు సీట్లను అధికారికంగా ప్రకటించారు. దక్షిణ సీటును తనకే ఖాయం చేశారంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం మొదలెట్టారు కూడా. దీనిపై జనసేన అధికారిక ప్రకటన వెలువరించకపోవడంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఆసరాగా తీసుకుని హడావుడి చేస్తోంది. రెండు రోజుల క్రితం జనసేన అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా యలమంచిలి అభ్యర్థి సుందరపు విజయకుమార్‌పై అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయన అభ్యర్థిత్వంపై మీ అభిప్రాయం చెప్పండంటూ ఆ నియోజకవర్గంలో కొంతమంది ఫోన్లకు ఐవీఎఆర్ఎస్ వస్తోంది. ఇప్పటికే టికెట్ ప్రకటించిన అభ్యర్థిపై మళ్లీ ఐవీఆర్ఎస్ ఏమిటంటూ విజయకుమార్‌తో పాటు జనసేన శ్రేణుల్లోనూ అలజడి రేగింది. పంచకర్ల వర్గీయుల ఉలిక్కిపాటు ఈ గందరగోళం సద్దుమణగక ముందే తాజాగా పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుపై కూడా జనసేన అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పంచకర్ల వర్గీయులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటికే పెందుర్తి స్థానం పంచకర్లకు ఖరారైందని తెలిసినా.. ఆ సీటు కోసం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రోజూ తన అనుచరులతో ఆందోళనలు, నిరసనలు చేయిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐవీఆర్ఎస్ సర్వేపై జనసేన నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమేనా? ఈ సర్వేలో యలమంచిలి అభ్యర్థి విజయకుమార్‌కు ప్రతికూలత ఉన్నట్టు తేల్చి ఆ సీటును పంచకర్లకు మార్పు చేస్తారన్న ప్రచారం బాగా జరుగుతోంది. దీంతో పెందుర్తి సీటును బండారుకు కేటాయించే వ్యూహంలో భాగంగా ఈ ఐవీఆర్ఎస్ ఎత్తుగడ అని జనసేన శ్రేణులు శంకిస్తున్నారు. అయితే సుందరపు విజయకుమార్ మాత్రం ఐవీఆర్ఎస్ సర్వేను తామే తరచూ చేయించుకుంటున్నామని సరికొత్త భాష్యం చెబుతున్నారు. అందువల్ల తన సీటు మార్పు జరగదని ధీమాతో ఉన్నారు. అనకాపల్లితో పాటు జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఇలా నాలుగు రోజులు, వారానికి ఐవీఆర్ఎస్ సర్వే ఎందుకు జరగడం లేదంటూ ఆ పార్టీ శ్రేణులే విస్తుపోతున్నారు. త్యాగరాజుగా పేరు గడించిన తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పెందుర్తి సీటును టీడీపీకి కేటాయించరన్న గ్యారంటీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద రెండు మూడు రోజులుగా జనసేన నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే ఆంతర్యమేమిటన్నది ఆ పార్టీ వర్గాలకు అస్సలు అంతుచిక్కడం లేదు. -
పవన్ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ
సాక్షి, విశాఖపట్నం: సర్వేల పేరుతో ఆశావహులు, అభ్యర్థులతో పాటు క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్.. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతుండగా, ఇదేం తిక్క అంటూ పవన్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ ధోరణిపై జనసేనలో రచ్చ జరుగుతోంది. తాజాగా, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్‌పై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. సీటు కేటాయించిన తర్వాత కూడా సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళనలో పడ్డారు. విజయ్ కుమార్‌ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం జరగ్గా, తరువాత జనసేన జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. మరోవైపు చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనుచరులతో ఆయన రహస్యంగా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. ఇదీ చదవండి: దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ? -
ఈ ఫోన్లేంటిరా బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ తెలుగు తమ్ముళ్లకు ఒకవైపు టెన్షన్, మరోవైపు చికాకు పుట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భావించి, స్థానిక ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్న నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పట్ల జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ టిక్కెట్టు వస్తుందని ఆశపడి..పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు అభిప్రాయ సేకరణతో వెనుకంజ వేస్తున్నారు. అధినేత ఆలోచనతో తమకు టిక్కెట్టు వస్తుందో రాదో అన్నభయం నాయకులను వెంటాడుతోంది. దీంతో నాయకులతో పాటు కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. టిక్కెట్టు ఇవ్వకూడదనుకున్న వారిని తప్పించేందుకు ఇదో మార్గం అని ఆపార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. కొద్దిరోజులుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా, అసెంబ్లీనియోజక వర్గాల్లోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయి. మీ నియోజకవర్గంలో ఎవరు సమర్ధులు, ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలనే ప్రశ్నలకు సమాధానాలు అడుగుతున్నారు. ఇలా చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు రాష్ట్ర కార్యాలయానికి తప్ప ఎవరికీ తెలియవు. ఆ ఫలితాలు మీకు అనుకూలంగా రాలేదని చూపించి టికెట్ నిరాకరిస్తే, ఇన్నాళ్లూ పడిన కష్టం ఏమైపోవాలని లోలోపలే మధనపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని, ఇటీవల వేరే పార్టీల్లోంచి వచ్చేవారికి టికెట్లు ఇవ్వడానికే ఈ వంక పెడుతున్నారనే అనుమానం తమ్ముళ్ళకు పట్టుకుంది. ఒకవైపు అసలు ఈ ఎన్నికల్లో పరువైనా దక్కుతుందో లేదోనని భయపడుతుంటే మళ్లీ ఈ ఫోన్ కాల్స్ గోలేంటిరా బాబూ అని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.