కీచక ఉపాధ్యాయుడు | govt teacher attempt to rape in porumamilla | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడు

Published Wed, Jun 15 2016 9:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

govt teacher attempt to rape in porumamilla

మహిళపై అత్యాచారయత్నం
దేహశుద్ధి చేసిన మహిళ, బంధువులు

 
పోరుమామిళ్ల: మండలంలోని మంగనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మంగళవారం ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మంగనపల్లె పాఠశాల పక్కనే వంట కోసం నిర్మించిన గది నిరుపయోగంగా ఉండటంతో అక్కడే నివసిస్తున్న ఓ కుటుంబం అందులో ధాన్యం, ఇతర వస్తువులు ఉంచుకున్నారు. రోజు లాగే మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంటికి చెందిన మహిళ వంటగదిలోకి వెళ్లి ధాన్యం తీసుకుంటుండగా, సదరు ఉపాధ్యాయుడు ఆ గదిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే ఆ మహిళ ప్రతిఘటించి పాదరక్షలతో దేహశుద్ధి చేసింది.

దీంతో అతను పాఠశాల వదిలి మోటార్‌బైక్‌పై పొరుగూరికి వెళ్లి అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని తిరిగి వస్తుండగా మంగనపల్లె వద్ద ఆ మహిళ భర్త, బంధువులు మరోమారు దాడి చేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడి భార్య ప్రాధేయపడటంతో వారు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు ఇటీవల అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement