sirsilla
-
అన్నిరంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది
-
సిరిసిల్ల జిల్లా కు సీఎం కే సిఆర్
-
నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన టిప్పర్
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ప్రాణహిత – చేవెళ్ల ప్యాకేజీ అండర్ టన్నెల్ పనుల్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ రాయ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్(29) డ్రిల్లింగ్ పనులకు వెళ్లారు. అక్కడ మిగతా కార్మికులు పని చేస్తుండగా.. రాయ్, సింగ్ మాత్రం పక్కన పడుకుని నిద్రలోకి వెళ్లారు. ఈ సమయంలో బయట నుంచి టిప్పర్‌తో వచ్చిన డ్రైవర్.. పడుకున్న ఇద్దరు కార్మికులను గమనించక నడపడంతో వీరిపైకి టిప్పర్ ఎక్కగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
సిరిసిల్లకు సంక్రాంతి శోభ
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. సిరిసిల్లకు పండుగ శోభ ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది. పని బాగుంది మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి. – వెల్ది హరిప్రసాద్, ఆసామి బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్ కంటే తమిళనాడు చీరలు నయమే. – మహేశుని ప్రసాద్, కార్మికుడు -
అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..
కరీంనగర్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి ...ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు పెద్దగా కేకలు పెట్టింది. ఇంతలో అక్కడకు వైద్య సిబ్బంది చేరుకోవటాన్ని గమనించిన అతడు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకాడు. దాంతో సత్తయ్య కాళ్లు విరిగాయి. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాజేశ్వరికి ‘సుద్దాల’ పురస్కారం
సిరిసిల్ల: రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా అంది స్తున్న సుద్దాల హన్మంతు జానకమ్మ పురస్కారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన కుమారి బూర రాజేశ్వరికి లభించింది. ఈ నెల 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు సుద్దాల అశోక్‌తేజ ప్రకటించారు. రాజేశ్వరి అంగవైకల్యంతో బాధపడుతూ ఏడో తరగతి వరకు చదువుకున్నారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు చేతులు లేకపోవడంతో కాలుతోనే కవితలు రాస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ సిరిసిల్లకు వచ్చి కలిశారు. ‘సంకల్పం ముందు వైకల్యం ఎంత.. దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత.. ఎదురీత ముందు విధిరాత ఎంత.. పోరాటం ముందు ఆరాటం ఎంత’ అంటూ రాజేశ్వరి సా హిత్యాన్ని అశోక్‌తేజ కవిత్వీకరించారు. రాజేశ్వరి కవితలను సుద్దాల ఫౌండేషన్ ద్వారా ముద్రిం చారు. ఆ పుస్తకాన్ని సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వం గా జనవరి 6న రవీంద్రభారతి వేదికగా ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకానికి డాక్టర్ సినారె ముందు మాట రాశారు. పుస్తక ఆవిష్కరణోత్సవంలో సినారె, ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభు త్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సినీ నట దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, నటుడు ఉత్తేజ్, ప్రజాగాయని సుద్దాల భారతి పాల్గొంటారని సుద్దాల ఫౌండేషన్ పేర్కొంది. సుద్దాల హన్మంతు పురస్కారాలను ఇప్పటివరకు ప్రముఖ సినీ దర్శక నిర్మాత బి.నర్సింగరావు, ప్రజాగాయకుడు గద్ద ర్, పద్మభూషన్ డాక్టర్ తీజన్బాయ్, కెన్యా దేశ రచయిత ప్రొఫెసర్ ఎన్.గుగి వాథియాంగో అందుకున్నారు. -
పెళ్లింట విషాదం
సిరిసిల్ల టౌన్, న్యూస్‌లైన్ : తెల్లవారితే ఆ ఇంట్లో పెళ్లి. పందిళ్లు... టెంట్లు.. ఇతర ఏర్పాట్లు... బంధువుల కోలాహలంతో అంతా సందడిగా ఉంది. ఇంతలో ఓ తాగుబోతు డ్రైవర్ ఆగడం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఆటోను ఇష్టారాజ్యంగా నడపడంతో ఇంటిముందు వేసిన పందిరితోపాటు పెళ్లికూతురు తండ్రిని ఢీకొట్టగా అతడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... సిరిసిల్ల పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన వేముల పుండరీకం(50) నేత కార్మికుడు. భార్య జమున బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు కాగా.. పెద్దకుమార్తెకు పెళ్లయింది. రెండోకూతురు అశ్విని వివాహం స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన పాముల రాజేందర్‌తో నిశ్చయించారు. గురువారం పెళ్లి. పెళ్లికూతురు ఇంటి ఎదుట పందిరి వేసి బుధవారం అంతా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతలో అతిగా మద్యం తాగి టాటా ఏస్ వాహనం(ట్రాలీ ఆటో) నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా పోనిస్తూ పందిరిని ఢీకొట్టాడు. పందిరి కూలడంతో ఇంట్లో ఉన్న పుండరీకం బయటకు వచ్చి డ్రైవర్‌ను నిలదీసే ప్రయత్నం చేశాడు. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని వెనకకు తీస్తూ పుండరీకంపైనుంచి పోనిచ్చాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన డ్రైవర్ వెంటనే అక్కడినుంచి ట్రాలీతో సహా పారిపోయాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. పీటలదాకా వచ్చిన అశ్విని పెళ్లి జరిపే విషయం పెద్దలు చర్చిస్తున్నారు. -
సిరిసిల్ల పాట.. గెలుపు బాట
మా పల్లె పొద్దుపొడుపు తుమ్మెదాలో.. మచ్చలేని చంద్రుడే తుమ్మెదాలో..., నారుమడిలో నాటేసే ఓమాయక్క.. మన ఊరి మంచి నాయకుడెవరే చెప్పక్క.. పేదోళ్ల పెన్నిధి.. బడుగోళ్ల బంధువు.... ఎవరున్నారే మాయక్క...., నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో.. అంటూ సాగే పల్లవిలతో పాటలు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారంలో మార్మోగుతున్నాయి. ఎన్నికల వేళ సిరిసిల్లకు చెందిన గాయకులు పాటలు కైగట్టి పాడుతున్నారు. అభ్యర్థులెవరైనా.. పార్టీ ఏదైనా సరే.. ఆ ప్రాంతానికి అనుగుణంగా పల్లె పదాలను జోడించి పాటలు రాస్తూ ఆలపిస్తున్నారు. సినిమా పాటలతోపాటు తెలంగాణ ఉద్యమగీతాల బాణీల్లో పాటలు రాస్తూ స్వరాలు అందిస్తున్నారు. సిరిసిల్ల పాటల రికార్డింగ్‌కు కేంద్రమైంది. తెలంగాణలోని పదిజిల్లాలతోపాటు వైజాగ్, రాజమండ్రి నుంచి కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పాటలతో ప్రచారం చేసేందుకు పోటీపడుతున్నారు. ఆన్లైన్లోనే ఆర్డర్లు ఇస్తూ పాటల సీడీలను రికార్డింగ్ చేయిస్తున్నారు. - న్యూస్‌లైన్, సిరిసిల్ల సంగీతం.. సాహిత్యం.. పాటకు అనుగుణంగా సంగీతాన్ని అందించడంలో సిరిసిల్లకు చెందిన జీఎల్ నాందేవ్ దిట్ట. సాహిత్యపరంగా జడల రమేశ్ అద్భుతమైన రచనలతో పాటలు ఉరకలెత్తిస్తున్నారు. ఒక్కో పాట రికార్డింగ్‌కు రూ.పదివేల వరకు ఖర్చవుతుండగా.. ఆడ, మగ గొంతులతో పాటలు పాడుతూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం పాటలతో ప్రచారం చేయించుకోవడానికి ఆరాటపడుతూ ఖర్చులకు వెనుకాడడంలేదు. మొత్తం పాట సదరు పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ, గుర్తు, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలను జోడిస్తూ పాటల్లో స్థానం కల్పిస్తున్నారు. శ్రావ్యమైన గొంతుకలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల కేంద్రంగా రెండు పాటల రికార్డింగ్ స్టూడియోలు ఉండగా.. రెండింటిల్లోనూ గాయకులు పాటలు పాడుతూ రికార్డింగ్‌లో బిజీగా ఉన్నారు. క్షణం తీరికలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లతో పాటల పల్లకీలో విహరిస్తున్నారు. ఉపాధి బాగుంది.. ఇరవై ఏళ్లుగా గాయకుడిగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఉపాధి బాగుంది. తలాపున పారుతుంది గోదారి.. అంటూ పాడిన పాట మంచి గుర్తింపు తెచ్చింది. లాయ్లాయ్ లబ్బర్బొమ్మ ఆల్బమ్‌తో మంచిపేరు వచ్చింది. పాటల రికార్డింగ్‌లో బిజీగా ఉన్నాం. - ఆకునూరి దేవయ్య, గాయకుడు ఎనిమిదేళ్లుగా పాటలు పాడుతున్న. ఈసారి మాత్రం ఎన్నికలు ఒకేసారి రావడంతో చాలా బిజీగా ఉన్న. అంతకుముందు ప్రైవేటు ఆల్బమ్స్, క్లాసికల్ మ్యూజిక్ పాడా. ప్రొఫెషనల్స్ ఆల్బమ్స్ చేశాం. ఒక్కో పాటకు రూ.వెయ్యి నుంచి రూ.పదిహేను వందలు ఇస్తున్నారు. మా వారి ప్రోత్సాహంతో పాడుతున్నా. - ఎస్.లలితాప్రసాద్, గాయకురాలు రాష్ట్రమంతటికీ పాటలు రికార్డ్చేస్తున్నాం. టెక్నాలజీ పెరిగింది. పాటలు ఒకసారి.. కోరస్ మరోసారి రికార్డ్చేస్తాం. పదిహేడేళ్లుగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. ఈ సీజన్లో ఇప్పటివరకు 120 పాటలు రికార్డ్ చేశా. వైజాగ్, రాజమండ్రితోపాటు చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. పాటల రికార్డింగ్ చేస్తున్నాం. - జీఎల్ నాందేవ్, గాయకుడు, సంగీత దర్శకుడు వందల పాటలు రాశా.. పాడా.. ఇప్పటికే వందల పాటలు రాశాను. వాటిని గాయకులతో పాడించాను. చాలా సందర్భాల్లో నేను కూడా పాడాను. ఎన్నికలు ఒకేసారి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆర్డర్ల మీద ఆర్డర్లొస్తున్నాయి. టైమ్‌కు అందించడం కష్టంగా ఉంది. రికార్డింగ్‌కు చాలా టైం తీసుకుంటోంది. ప్రచార గడువులోగా అందరికీ అందించడం ఇబ్బందే.. - జడల రమేశ్, గాయకుడు, రచయిత