
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ప్రాణహిత – చేవెళ్ల ప్యాకేజీ అండర్ టన్నెల్ పనుల్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ రాయ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్(29) డ్రిల్లింగ్ పనులకు వెళ్లారు.
అక్కడ మిగతా కార్మికులు పని చేస్తుండగా.. రాయ్, సింగ్ మాత్రం పక్కన పడుకుని నిద్రలోకి వెళ్లారు. ఈ సమయంలో బయట నుంచి టిప్పర్‌తో వచ్చిన డ్రైవర్.. పడుకున్న ఇద్దరు కార్మికులను గమనించక నడపడంతో వీరిపైకి టిప్పర్ ఎక్కగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.