
తన కన్నబిడ్డలను కనికరం లేకుండా కొడుతున్న తండ్రి చైన్ సింగ్
సాక్షి, జైపూర్ : రాజస్థాన్‌లో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలనే గొడ్డును బాదినట్లు బాదాడు. ఏమాత్రం జాలి దయ లేకుండా కొడుకును తాడుతో కట్టి సీలింగ్‌కు వేలాడ దీసి కొట్టగా అది చూసి పారిపోతున్న మూడేళ్ల తన కూతురుని కాలితో తన్ని కిందపడేసి కర్రతో చావు దెబ్బలు కొట్టాడు. ఈ దృశ్యాలను అతడి సోదరుడు వీడియో తీసి పోలీసులకు పంపించడంతో అతడిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజాసమానంద్ అనే ప్రాంతంలో చైన్ సింగ్ (32) అనే వ్యక్తి ఉన్నాడు.
అతడికి ఓ పాప, బాబు. వారిలో బాబుకి ఐదేళ్లుకు కాగా పాపకు మూడేళ్లు. అయితే, వారిద్దరు తమ ప్యాంట్లకు మట్టి అంటించుకున్నారనే కారణంతో చైన్ సింగ్ వారిపై దాడికి దిగాడు. కొడుకు చేతులను తాడుతో కట్టి సీలింగ్ వేలాడదీసి కొట్టగా కూతురును కాలితో తన్నాడు. వారు దెబ్బల బాధకు ఏడుస్తుంటే సోదరుడు వాట్టా సింగ్ మాత్రం వీడియో తీసి పోలీసులకు పంపాడు. కాగా, పిల్లలను కొడుతుంటే ఆపకుండా వీడియో తీసినందుకు పోలీసులు వాట్టా సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా, చైన్ సింగ్ దాడి చేస్తుంటే అతడి భార్య కూడా భయంతో అతడిని అడ్డుకోలేకపోయిందట. జువెనైల్ యాక్ట్ కింద చైన్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలులో వేశారు.

కొడుకును వేలాడదీసి కనికరం లేకుండా కొడుతున్న తండ్రి చైన్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment