కొడుమూరు: కర్నూలు జిల్లాలో కన్నతండ్రిపై కొడుకు కొడవలితో దాడికి తెగబడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కొడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో ఆస్తి పంపకాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కుమారుడు పాపన్న తన తండ్రి రంగన్న(68) పై దాడి చేశాడు.
పాపన్న ఆస్తి పంచాలంటూ తన తండ్రిని కోరాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తీవ్ర ఆవేశంతో పాపన్న కొడవలితో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రంగన్నను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.