
వివాదానికి కారణమైన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
కృష్ణగిరి(కర్నూలు జిల్లా): ఇంటి ముందు ఉన్న ఆరడుగుల స్థలం కోసం రెండు కుటుంబాలు గొడవ పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బోయబొంతిరాళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జోలాపురం డాక్టర్ హనుమంతు, కొత్తపల్లి రామాంజినేయులు నివాసాలు పక్క పక్కనే ఉన్నాయి. డాక్టర్ హనుమంతు ఇంటి ముందు ఉన్న ఆరడుగుల స్థలం విషయంలో ఇరువురి మధ్య వివాదం సాగుతోంది.
ఇదే విషయంపై ఆదివారం ఉదయం ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగి కట్టెలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన డాక్టర్ హనుమంతు రామాంజినేయులు, మురళీమోహన్, కొత్తపల్లి రామాంజినేయులు, హనుమంతు, వీరాంజినేయులుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాదానికి కారణమైన స్థలాన్ని ఎస్‌ఐ రామాంజినేయరెడ్డి పరిశీలించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment