చేతులకు రక్తం వచ్చేలా..
గ్వాంగ్ డాంగ్: క్రమశిక్షణ పేరిట చిన్నారుల విషయంలో చైనా టీచర్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఏవో కారణాలమూలంగా తరగతులకు హాజరుకాలేని చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సాధారణంగా కాళ్లతో నడవడం అందరు చేస్తే పాఠశాలకు రావడం లేదనే ఆగ్రహంతో ఆ చిన్నారులను చేతులతో నడిపిస్తున్నారు. ఎంతలా అంటే రక్తాలు కారేంతగా.. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్లోని జిజియాంగ్ మిడిల్ స్కూల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడా స్కూల్ క్షమాపణలు చెప్పి వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్ధమైంది. అయితే, తమ పాఠశాలలో అంత కఠిన శిక్షలు అస్సలు విధించమని, విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టడం వల్లే కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటాం తప్ప వారిని వేధించాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. అక్కడి స్థానికులు అధికారులు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది.