బీజింగ్: చైనాలోని దాదాపు 13.4 లక్షల మంది అవినీతి అధికారులను ఆ దేశ ప్రభుత్వం శిక్షించింది. అవినీతిని నిర్మూలించేందుకుగాను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించిన ‘స్వీపింగ్ యాంటీ కరప్షన్’ కార్యక్రమంలో భాగంగా అవినీతి అధికారులను గుర్తించి శిక్షించారు. అక్టోబర్ 18న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ)కు నేతృత్వం వహిస్తున్న వాంగ్ క్విషాన్ ఈ వివరాలను ఆదివారం వెల్లడించారు.
2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు పేర్కొన్నారు. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అధికార పత్రిక వెల్లడించింది. మిలిటరీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్‌గా పనిచేసిన జనరల్ జు కైహూతోపాటు జనరల్ జూ బోక్సంగ్‌ను కూడా శిక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment